త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | పెద్ది కాంబో రిపీట్‌ – బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ మెగా హీరోతోనేనా?

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీ మూడు రోజుల్లోనే 236 కోట్ల వ‌సూళ్ల‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. పెద్దిలో రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్‌, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా టేకింగ్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. పెద్ది త‌ర్వాత బుచ్చిబాబు సానా త‌న నెక్స్ట్ మూవీని మ‌ళ్లీ రామ్‌చ‌ర‌ణ్‌తోనే చేయ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Jun 7, 2026, 4.56 pm IST

Ram Charan | పెద్ది కాంబో రిపీట్‌ – బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ మెగా హీరోతోనేనా?
Advertisement

Ram Charan |  రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ మూడు రోజుల్లోనే 236 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్‌, బుచ్చిబాబు టేకింగ్‌పై అద్భుత‌మంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా నిజాయితీతో కూడిన ప్ర‌య‌త్న‌మంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. పెద్దిపై నెగెటివ్ కామెంట్స్‌ భారీగానే వ‌స్తోన్నాయి. ముఖ్యంగా జాన్వీ క‌పూర్ క్యారెక్ట‌ర్‌ను చూపించిన తీరు బాగాలేదంటూ విమ‌ర్శిస్తున్నారు. ఎమోష‌న్స్‌, లాజిక్స్ మిస్స‌య్యాయంటూ కామెంట్లు పెడుతోన్నారు.

మ‌రో మూవీ...

ఈ విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా పెద్ది స‌క్సెస్‌ను మేక‌ర్స్ ఎంజాయ్ చేస్తోన్నారు. కాగా పెద్ది త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ రానున్న‌ట్లు స‌మాచారం. బుచ్చిబాబు రైటింగ్ స్కిల్స్‌, డైరెక్ట‌ర్‌గా అత‌డి టాలెంట్‌కు ఫిదా అయిన రామ్‌చ‌ర‌ణ్ మ‌రో సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడ‌ట‌. పెద్ది సినిమాకు భిన్నంగా ఈ సారి స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ స్క్రిప్ట్‌ను బుచ్చిబాబు రెడీ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. పెద్ది షూటింగ్ టైమ్‌లోనే రామ్‌చ‌ర‌ణ్‌కు పాయింట్ వినిపించాడ‌ట‌. డైరెక్ట‌ర్ చెప్పిన లైన్‌కు ఇంప్రెస్ అయిన చ‌ర‌ణ్ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌ను రెడీ చేయ‌మ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. సుకుమార్ తో రామ్‌చ‌ర‌ణ్ చేయ‌నున్న సినిమా పూర్త‌యిన వెంట‌నే బుచ్చిబాబు సినిమా మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం.

ఆర్‌సీ 17...

పెద్ది త‌ర్వాత డైరెక్ట‌ర్ సుకుమార్‌తో రామ్‌చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. రంగ‌స్థ‌లం క‌ల‌యిక‌లో రాబోతున్న ఈ మూవీ జూలైలో మొద‌లుకాబోతుంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 17వ మూవీ ఇది.

 

Advertisement
Advertisement