Telugu OTT | గత వారం థియేటర్లలో….ఈ వారం ఓటీటీలో – అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన తెలుగు రొమాంటిక్ మూవీ అగ్లీ స్టోరీ థియేటర్లలో రిలీజైన పధ్నాలుగు రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 5న ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
Entertainment | Published On Jun 4, 2026, 7.18 pm IST
Telugu OTT | థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య గ్యాప్ రాను రాను తగ్గుతుండటంపై సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని లేదంటే థియేటర్లు మూతపడతాయని అంటున్నారు. తాజాగా నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన తెలుగు మూవీ అగ్లీ స్టోరీ థియేటర్లలో రిలీజైన పధ్నాలుగు రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. శుక్రవారం (జూన్ 5 ) ఆహా ఓటీటీలో ఈ తెలుగు మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా అధికారికంగా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
వెరైటీ ప్రమోషన్స్...
రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహించారు. రవితేజ మహాదాస్యం, శివాజీరాజా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం నందు వెరైటీ ప్రమోషన్స్ చేశాడు. కానీ అతడి కష్టం వృథాగానే మిగిలిపోయింది. కమర్షియల్‌గా అగ్లీ స్టోరీ సరైన విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమాలో సైకోగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో నందు కనిపించాడు.
సైకో భర్త...
ఓ ప్రమాదంలో నేహా (అవికా గోర్) తల్లిదండ్రులు చనిపోతారు. మావయ్య ఆమెను చేరదీస్తాడు. గౌతమ్‌ను (రవితేజ మహాదాస్యం) ప్రేమిస్తుంటుంది నేహా. అతడిని పెళ్లిచేసుకోవాలని ఆశపడుతుంది. కానీ మరదలిపై పిచ్చి ప్రేమను పెంచుకుంటాడు మావయ్య కొడుకు కార్తీక్ (నందు). ఇష్టం లేకపోయినా మావయ్య మాట కాదనలేక కార్తీక్‌ను పెళ్లి చేసుకుంటుంది నేహా. సైకో అయిన కార్తీక్ కారణంగా నేహా ఎలాంటి కష్టాలు పడింది? గౌతమ్ మిస్సింగ్‌కు కారణం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | తండ్రిగా గర్వపడుతున్నా – రామ్‌చరణ్ పెద్దిపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
జూన్ 4, 2026

Peddi Review | పెద్ది రివ్యూ – రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది – జాన్వీ కపూర్ మైనస్!
జూన్ 4, 2026

Tollywood | మేలో 18 సినిమాలు డిజాస్టర్.. జూన్‌పైనే టాలీవుడ్ ఆశలు..!
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Ram Gopal Varma | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ
- ●Husnabad Engineering College | హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీకి మహర్దశ.. హాస్టళ్ల నిర్మాణానికి రూ. 6.25 కోట్లు మంజూరు
- ●Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!
- ●Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వకూడదనే.. సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత: మంత్రి పొంగులేటి
- ●Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింగ్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్
- ●Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన

Ram Gopal Varma | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ

Husnabad Engineering College | హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీకి మహర్దశ.. హాస్టళ్ల నిర్మాణానికి రూ. 6.25 కోట్లు మంజూరు

Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!

Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వకూడదనే.. సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత: మంత్రి పొంగులేటి



