త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Avika Gor | ఫారిన్‌లో ఇళ్లు కొన్న టాలీవుడ్ హీరోయిన్ – సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌నుందా?

ఉయ్యాల జంపాల మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్‌. ఈ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప‌ద‌మూడేళ్లు అవుతోన్న స‌రైన పేరు, గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో సినిమాల‌కు గుడ్‌బై చెప్పి భ‌ర్త‌తో క‌లిసి ఫారిన్‌లో అవికా గోర్ సెటిల‌వ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On May 10, 2026, 4.50 pm IST

Avika Gor |  ఫారిన్‌లో ఇళ్లు కొన్న టాలీవుడ్ హీరోయిన్ – సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌నుందా?
Advertisement

Avika Gor |  ఉయ్యాల జంపాల మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అవికాగోర్‌. తొలి అడుగులోనే నాచుర‌ల్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఉయ్యాల జంపాల త‌ర్వాత సినిమా చూపిస్తా మావ‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో పాటు మ‌రికొన్ని విజ‌యాల‌ను అందుకుంది. ఎక్కువ‌గా చిన్న సినిమాల్లోనే క‌నిపించిన ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో పేరు, గుర్తింపు మాత్రం ద‌క్క‌లేదు.

ప్రియుడితో పెళ్లి....

2019లో సోష‌ల్ యాక్టివిస్ట్ మిలింద్ చంద్వానీతో ప్రేమ‌లో ప‌డింది అవికా గోర్‌. గ‌త ఏడాది ప‌తి ప‌త్నీ ఔర్ పంగా అనే రియాలిటీ షోలో ప్రియుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ స‌క్సెస్‌లు మాత్రం రాలేదు.

సినిమాల‌కు గుడ్‌బై

దాంతో సినిమాల‌కు గుడ్‌బై చెప్పి భ‌ర్త‌తో క‌లిసి ఫారిన్‌లో సెటిల‌వ్వాల‌ని అవికా గోర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే బ్యాంకాక్‌లో సొంత ఇళ్లు కూడా కొన్న‌ద‌ని అంటున్నారు. ఈ రూమ‌ర్ల‌పై ఓ ఇంట‌ర్వ్యూలో అవికా గోర్ రియాక్ట్ అయ్యింది. బ్యాంకాక్‌లో ఇళ్లు కొన్న‌ది నిజ‌మేన‌ని అన్న‌ది. "నా కెరీర్ ఎదుగుద‌ల కోసం మిలింద్ ఎన్నో త్యాగాలు చేశాడు, ఇన్నేళ్లు నేను సినిమాలు చేయ‌గ‌లిగానంటే అత‌డి ఇచ్చిన స‌పోర్ట్ కార‌ణం. మిలింద్ లేకుండా నా జ‌ర్నీని ఊహించ‌డం క‌ష్ట‌మే. అత‌డి కెరీర్ కోస‌మే బ్యాంకాక్‌లో సెటిల‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఇటీవ‌లే ఇంటిని కొన్నాం" అని చెప్పింది.

ఆ భయం లేదు..

ఫారిన్‌లో ఇళ్లు కొన్నా... సినిమాల‌కు మాత్రం దూరం కాన‌ని అవికా గోర్ అన్న‌ది. విదేశాల‌కు వెళ్ల‌డం వ‌ల్ల ఆఫ‌ర్లు త‌గ్గుతాయ‌నే భ‌యం కూడా త‌న‌కు లేద‌ని చెప్పింది. "నాతో ప‌నిచేయాల‌ని అనుకునే వారూ న‌న్ను ఎలాగైనా అప్రోచ్ అవుతారు. ఈ డిజిట‌ల్‌ యుగంలో ఫారిన్‌లో ఉంటూ ఇండియాలో సినిమాలు చేయ‌డం పెద్ద విష‌య‌మేమి కాదు. కాక‌పోతే ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే ఇంకాస్త సెలెక్టివ్‌గా సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నా" అని అన్న‌ది.

ప్ర‌స్తుతం తెలుగులో అగ్లీ స్టోరీ పేరుతో ఓ సినిమా చేస్తోంది అవికా గోర్‌. నందు హీరోగా న‌టించిన ఈ మూవీ మే 22న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాకు ప్ర‌ణ‌వ స్వ‌రూప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

 

Advertisement
Advertisement