Toxic | టాక్సిక్ సినిమా టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిరసన- వీడియో వైరల్
టాక్సిక్ సినిమా కోసం పెట్టిన టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ అభిమానులు థియేటర్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. వీ వాంట్ రీఫండ్ అంటూ గొడవకు దిగారు. ఈ వీడియోను బాలీవుడ్ క్రిటిక్ కేఆర్‌కే ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Aug 28, 2026, 12.19 pm IST
Toxic |యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీ ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. కేజీఎఫ్ , కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటించిన ఈ సినిమాపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ లాంటి టాప్ హీరోయిన్లు ఈ సినిమాలో నటించడం, ఐదు వందల కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కడంతో ఆరంభం నుంచే ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. కేజీఎఫ్ 2 బిగ్గెస్ట్ హిట్ తర్వాత యశ్ తో సినిమా చేసేందుకు పలువురు అగ్ర దర్శకులు ఆసక్తిని చూపించారు. కానీ యశ్ మాత్రం వారందరిని కాదని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌కు అవకాశం ఇవ్వడంతో ఇందులో ఏదో కొత్తదనం ఉందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. అందుకు తగ్గట్లే యాక్షన్, బోల్డ్ సన్నివేశాలతో టీజర్, ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
డిజాస్టర్ టాక్....
పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ హైప్‌తో ఈ బుధవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్‌ను దారుణంగా డిసపాయింట్ చేసింది. కథ లేకుండా కేవలం యాక్షన్, బోల్డ్ అంశాలతో డైరెక్టర్ గీతూమోహన్‌దాస్ సినిమాను తెరకెక్కించడం, కేజీఎఫ్‌ను పోలి యశ్ క్యారెక్టర్ సాగడంతో టాక్సిక్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రీమియర్స్‌తో యునానమస్‌గా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది.
వీ వాంట్ రీఫండ్
తాజాగా టాక్సిక్ సినిమా చూసిన ఆడియెన్స్ టికెట్ కోసం పెట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ గొడవ చేశారు. వీ వాంట్ రీఫండ్ అంటూ థియేటర్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానుల నిరసనను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ వీడియోను బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కేఆర్‌కే ఖాన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగింది అన్నది మాత్రం కేఆర్‌కే ఖాన్ రివీల్ చేయలేదు.
150 కోట్లు...
నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా టాక్సిక్ మూవీ తొలిరోజు 150 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ పోస్టర్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. టాక్సిక్ మూవీకి గీతూ మోహన్ దాస్‌తో కలిసి యశ్ కథను అందించారు.
First time in the history, people are protesting for refund after watching film #TOXIC.😜😂😁 pic.twitter.com/NE9mq3CEdH
— KRK (@kamaalrkhan) August 28, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
- ●Nepal Flash Floods | వరద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ వీడియో
- ●TGSRTC | రాఖీ పండుగ.. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ అదనపు బాదుడు
- ●CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.31వేలు తగ్గిన బంగారం ధర..
- ●Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత

Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

Nepal Flash Floods | వరద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ వీడియో

TGSRTC | రాఖీ పండుగ.. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ అదనపు బాదుడు

CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్






