త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Athiya Shetty | క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ భార్య‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు – కార‌ణం ఇదే!

టీమిండియా క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ భార్య‌, బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టిపై నెటిజ‌న్లు ఫైర్ అవుతోన్నారు. ఆదివారం మ‌ర‌ణించిన దిగ్గ‌జ గాయ‌ని అశా భోస్లేకు సోష‌ల్ మీడియా ద్వారా అతియా శెట్టి నివాళులు అర్పించింది. అయితే అశా భోస్లే ఫొటో బ‌దులుగా ల‌తా మంగేష్క‌ర్ ఫొటోను అతియా శెట్టి పోస్ట్ చేయ‌డం వివాదానికి దారితీసింది.

N

Entertainment | Published On Apr 13, 2026, 3.13 pm IST

Athiya Shetty | క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ భార్య‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు – కార‌ణం ఇదే!
Advertisement

Athiya Shetty | టీమిండియా క్రికెట‌ర్ భార్య‌, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిని నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. సీనియ‌ర్ హీరో సునీల్ శెట్టి వార‌సురాలిగా 2015లో రిలీజైన హీరో మూవీతో హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి తొలి అడుగు వేసింది అతియా శెట్టి. ముబార‌క‌న్‌, న‌వాబ్‌జాదే, మోతీచూర్ చ‌క్నాచూర్ సినిమాలు చేసింది. అతియా శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. వీటిలో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో ఆక‌ట్టుకుంది. కానీ అతియా శెట్టి న‌ట‌న‌పై చాలానే ట్రోల్స్ వ‌చ్చాయి.

కేఎల్ రాహుల్‌తో ప్రేమాయ‌ణం...

కేఎల్ రాహుల్‌తో ప్రేమ‌లో ప‌డిన అతియా శెట్టి అత‌డిని పెళ్లి చేసుకొని సినిమాల‌కు దూరమైంది. తాజాగా అతియా శెట్టిపై బాలీవుడ్ ఫ్యాన్స్ విరుచుకుప‌డుతున్నారు. ఆదివారం దిగ్గ‌జ గాయ‌ని అశా భోస్లే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌గా అశాభోస్లేకు నివాళులు అర్పించింది అతియాశెట్టి. అయితే అశా భోస్లే బ‌దులు ల‌తా మంగేష్క‌ర్ ఫొటోను పోస్ట్ చేసింది. కొద్ది సేప‌టి త‌ర్వాత త‌న పొర‌పాటును గుర్తించిన అతియా శెట్టి ల‌తా మంగేష్క‌ర్ ఫొటోను డిలీట్ చేసి అశా భోస్లే ఫొటోను తిరిగి పోస్ట్ చేసింది. కానీ అప్ప‌టికే ఆమె చేసిన త‌ప్పిదం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ల‌తా మంగేష్క‌ర్‌కు అశాభోస్లేకు తేడా కూడా తెలియ‌దా అంటూ నెటిజ‌న్లు ఈ బాలీవుడ్ బ్యూటీని తెగ ఆడుకుంటున్నారు. బ్యూటీ వితౌట్ బ్రెయిన్ అంటూ ఆమెపై నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సీనియ‌ర్ హీరో కూతురికి అయ్యిండి బాలీవుడ్ దిగ్గ‌జ సింగ‌ర్‌ను ఇలా అవ‌మానిస్తావా అంటూ ఆమెపై ఫైర్ అవుతోన్నారు. అందుకే అతియా శెట్టి హీరోయిన్‌గా స‌క్సెస్ కాలేదంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

సినిమాల‌కు గుడ్‌బై

కాగా అతియా శెట్టి సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఏడాది కూతురికి జ‌న్మ‌నిచ్చింది అతియా శెట్టి. కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మ‌వ్వాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని అంటున్నారు.

 

Advertisement
Advertisement