Vijay Mallya | విజయ్ మాల్యా జీవితంపై వెబ్‌సిరీస్ – టైటిల్ రోల్‌లో భగవంత్ కేసరి విలన్
బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా జీవితం ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. బిలియనీర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో విజయ్ మాల్యా పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Aug 30, 2026, 4.18 pm IST
Vijay Mallya | బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన బిజినెస్‌మెన్ విజయ్ మాల్యా జీవితం ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. పొలిటికల్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు బిలియనీర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
అర్జున్ రాంపాల్...
ఈ వెబ్‌సిరీస్‌లో విజయ్ మాల్యా పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ హన్సల్ మెహతా, రాబీ గ్రేవాల్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నిర్మిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కాబోతుంది.
పెద్ద బిజినెస్‌మెన్‌గా...
నవంబర్ నుంచి బిలియనీర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సాధారణ స్థాయి నుంచి దేశంలోనే పెద్ద బిజినెస్‌మెన్‌గా ఓ వ్యక్తి ఎలా ఎదిగాడు? తప్పటడుగుల కారణంగా అతడి వ్యాపార సామ్రాజ్యం ఎలా కూలిపోయింది? అప్పులు తీర్చలేక విదేశాల్లో అజ్ఞాతజీవితాన్ని ఏ విధంగా గడుపుతున్నాడనే అంశాలతో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది.
వ్యక్తిగత జీవితం
ఈ సిరీస్‌లో విజయ్ మాల్యా బిజినెస్‌మెన్‌గా విజయ్ మాల్యా సంపాదించిన పేరు ప్రతిష్టలు మాత్రమే కాకుండా అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రపంచానికి తెలియని కోణాలను ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. విదేశాలకు అతడు పారిపోవడానికి ఎవరూ సాయం చేశారనే అంశాలను చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో బాలీవుడ్‌కు చెందిన పలువురు సీనియర్ యాక్టర్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
భగవంత్ కేసరి...
బాలీవుడ్‌లో హీరోగానే కాకుండా విలన్‌గా చాలానే సినిమాలు చేశాడు అర్జున్ రాంపాల్. రీసెంట్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ధురంధర్, ధురంధర్ 2లో మెయిన్ విలన్‌గా కనిపించాడు. బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ రాంపాల్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lokesh Kanagaraj | ఒకే సారి రెండు ఓటీటీలలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ – 25 కోట్ల బడ్జెట్ – వంద కోట్ల కలెక్షన్స్
ఆగస్టు 28, 2026

Ott Releases This Week | ఈ వారం ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఒక్కోటి ఒక్కో జానర్
ఆగస్టు 28, 2026

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్

Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు

Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం



