Arrive-Alive Programme | పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు.. ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయొద్దు
Arrive-Alive Programme | మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని.. తల్లిదండ్రులు, వాహన యజమానులు వారికి తమ వాహనాలను ఇవ్వొద్దని కుల్సుంపురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సూచించారు.
- గుడిమల్కాపూర్‌లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పోలీసుల సూచనలు
Arrive-Alive Programme | త్రినేత్ర.న్యూస్: మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని.. తల్లిదండ్రులు, వాహన యజమానులు వారికి తమ వాహనాలను ఇవ్వొద్దని కుల్సుంపురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సూచించారు. ఆదివారం కుల్సుంపురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించి మార్కెట్ కమిటీ సభ్యులకు, వాహనదారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సురక్షితమైన ప్రయాణానికి సహకరించాలని కోరారు.
చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేకుండా ఎలాంటి వాహనాన్ని నడపొద్దు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. తల్లిదండ్రులు, యజమానులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం. ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరం. కేవలం అనుమతించిన మార్గాల్లో, నిబంధనల ప్రకారం సురక్షితంగా మాత్రమే ఓవర్‌టేక్ చేయాలి. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి అని పోలీసులు సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం
- ●NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..
- ●JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
- ●ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం
- ●Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?
- ●వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్‌కు ‘కొండంత’ నొప్పి!

Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం

NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..

JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం




