World level Cricket Stadium in Hyderabad | హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు
World level Cricket Stadium in Hyderabad | హైదరాబాద్ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని కళ్లు జిగేల్ మనేలా నిర్మించనున్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని మించిపోయేలా, ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానాన్ని మరిపించేలా స్టేడియాన్ని అందుబాటులోకి తేనున్నారు.
- మోదీ స్టేడియాన్ని మించిపోయేలా.. లార్డ్స్‌ను మరిపించేలా
- ఫ్యూచర్‌సిటీలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు
- నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను మోయనున్న బీసీసీఐ
World level Cricket Stadium in Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని కళ్లు జిగేల్ మనేలా నిర్మించనున్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని మించిపోయేలా, ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానాన్ని మరిపించేలా స్టేడియాన్ని అందుబాటులోకి తేనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్నారు. వచ్చే డిసెంబర్‌లో దీనికి శంకుస్థాపన జరిగే అవకాశాలున్నాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం 1.32 లక్షల సీటింగ్ సామ్యర్థ్యాన్ని మించిపోయేలా ఈ నూతన వేదికను ప్లాన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ క్రికెట్ స్టేడియాల తరహాలో ఈ ప్రాంగణాన్ని ప్రపంచ స్థాయి క్రీడా మైలురాయిగా తీర్చిదిద్దనున్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాల్లో ఒకటిగా నిలవనుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం స్థలాన్ని కేటాయించనుండగా నిర్మాణ వ్యయం, నిర్వహణ బాధ్యతలను బీసీసీఐ (BCCI) భరించనుంది. బీసీసీఐ, టీజీ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయనున్నాయి.
ఫ్యూచర్ సిటీలో ఎందుకంటే..
ఔటర్ రింగ్ రోడ్ (ORR), ప్రతిపాదిత RRR, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ పొడిగింపునకు సమీపంలో ఉండటం వల్ల క్రికెట్ అభిమానులకు రవాణా సౌకర్యం సులభమవుతుంది. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా.. ఇక్కడ 18 ఎకరాలలో గోల్ఫ్ కోర్స్, ఫుట్‌బాల్, ఇతర ప్రధాన క్రీడల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలోని 'స్పోర్ట్స్ సిటీ', పర్యాటకం, నెట్-జీరో సిటీ (Net-Zero City) దృష్టిలో భాగంగా ఈ స్టేడియం ముఖ్య కేంద్రంగా మారనుంది. తద్వారా ప్రపంచ క్రీడా గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానం మరింత బలపడనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి




