త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

A R Rahman | పెద్దితో పాటు ర‌హ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్న అప్‌క‌మింగ్ మూవీస్ ఇవే – 14 సినిమాల‌తో బిజీ

బాలీవుడ్‌లో త‌న‌కు అవ‌కాశాలు త‌గ్గ‌డానికి మ‌త‌ప‌ర‌మైన అంశాలు కార‌ణమ‌ని ర‌హ‌మాన్ చేసిన కామెంట్లు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ర‌హ‌మాన్ మాత్రం ఖాళీగా లేరు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో క‌లిపి 14 సినిమాల‌కు మ్యూజిక్ అందిస్తున్నారు.

N

Entertainment | Published On Jan 18, 2026, 11.47 am IST

A R  Rahman | పెద్దితో పాటు ర‌హ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్న అప్‌క‌మింగ్ మూవీస్ ఇవే – 14 సినిమాల‌తో బిజీ
Advertisement

A R Rahman |  బాలీవుడ్‌లో (Bollywood)అవ‌కాశాలు త‌గ్గ‌డంపై ఆస్కార్ విన్న‌ర్ ర‌హ‌మాన్ (A R Rahman) చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. గ‌త ఎనిమిదేళ్లుగా హిందీ ఇండ‌స్ట్రీలో త‌న‌కు అవ‌కాశాలు త‌గ్గాయ‌ని ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ర‌హ‌మాన్ పేర్కొన్నారు. అందుకు సృజ‌నాత్మ‌కత లేని వ్య‌క్తుల డామినేష‌న్‌తో పాటు మ‌త‌ప‌ర‌మైన అంశాలు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని ర‌హ‌మాన్ అన్నారు.
బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో నెటిజ‌న్లు ర‌హ‌మాన్ కామెంట్ల‌ను త‌ప్పుప‌డుతున్నారు. ర‌హ‌మాన్ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్‌ను ఊహించ‌లేద‌ని అంటున్నారు. ర‌హ‌మాన్‌కు అవ‌కాశాలు త‌గ్గ‌డానికి అత‌డి మ‌తానికి ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతున్నారు. ర‌హ‌మాన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ప‌ధ్నాలుగు సినిమాల‌తో బిజీ...

ర‌హ‌మాన్ స్వ‌యంగా త‌న‌కు అవ‌కాశాలు త‌గ్గాయ‌ని చెప్ప‌డంతో నిజంగానే అత‌డి చేతిలో సినిమాలేవి లేవ‌ని చాలా మంది నెటిజ‌న్లు అనుకుంటున్నారు.కామెంట్లు పెడుతున్నారు. కానీ అందులో నిజం లేదు.
ప్ర‌స్తుతం ప‌ధ్నాలుగు సినిమాల‌కు మ్యూజిక్ అందిస్తున్నారు ర‌హ‌మాన్‌. అందుతో హిందీతో పాటు తెలుగు, త‌మిళ సినిమాలు ఉన్నాయి. సినిమాలు, మ్యూజిక్ కాన్సెర్ట్‌ల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు రెహ‌మాన్‌.

తెలుగులో పెద్ది....

తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ పెద్ది సినిమాకు ర‌హ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.
రామాయ‌ణ పార్ట్ వ‌న్‌, లాహోర్ 1947, క‌మ‌ల్ ఔర్ మీనా, గాంధీ, ఖోజ్‌తో పాటు హిందీలో ప్ర‌స్తుతం ఎనిమిది సినిమాల‌కు ర‌హ‌మాన్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నారు.
త‌మిళంలో మూన్‌వాక్‌, గాంధీ టాక్స్‌, జీనీతో పాటు ర‌హ‌మాన్ మ్యూజిక్ అందించిన మ‌రికొన్ని సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అర‌బిక్‌, హాలీవుడ్ సినిమాల‌కు సంగీతం అందిస్తున్నారు. త‌మిళ మూవీ మూన్‌వాక్‌తో యాక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఇందులో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మ‌రో ఏడాది వ‌ర‌కు ర‌హ‌మాన్ డేట్స్ ఖాళీ లేవు.
ప్ర‌స్తుతం ఇండియాలోనే హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ కూడా ర‌హ‌మాన్ కావ‌డం గ‌మ‌నార్హం. ఒక్కో సినిమా కోసం ప‌ది నుంచి ప‌న్నెండు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడు. సింగ‌ర్‌గా కూడా ర‌హ‌మానే రెమ్యూన‌రేష‌న్‌లో టాప్‌లో ఉన్నాడు. ఒక్కో పాట పాడినందుకు మూడు కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement