A R Rahman | నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు – వివాదంపై రెహమాన్ క్లారిటీ
బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి మతపరమైన అంశాలే కారణమంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఏఆర్ రెహమాన్ వెనక్కి తగ్గారు. తన మాటల వెనుక ఉద్దేశం వేరని, వాటిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jan 18, 2026, 1.13 pm IST
Ar Rahman | బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడంపై మతపరమైన అంశాలే కారణం కావచ్చునంటూ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్లు వివాదాస్పదయ్యాయి. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి వినోద్ బన్సల్‌తో పాటు జావేద్ అక్తర్, కంగనా రనౌత్ వంటి సినీ ప్రముఖులు రెహమాన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. నెటిజన్లు కూడా చాలా మంది రెహమాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
తన కామెంట్లు విమర్శలకు దారితీయడంతో రెహమాన్ రియాక్ట్ అయ్యారు. ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెడుతూ ఓ స్పెషల్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. తన మాటల వెనుక ఉన్న ఉద్దేశం వేరని, వాటిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకన్నారని రెహమాన్ పేర్కొన్నారు.
దేశమే నాకు గురువు...ఇళ్లు...
భారత దేశమే తనకు స్ఫూర్తి, ఇళ్లు, గురువుగా నిలిచిందని రెహమాన్ అన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా, సృజనాత్మకంగా తన సంగీత ప్రయాణం సాగడానికి దేశమే ప్రేరణగా నిలిచిందని చెప్పారు. భారతీయుడిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని రెహమాన్ అన్నారు. దేశంలోని సంస్కృతులకు వారధిగా నిలవడమే కాకుండా వాటిని గౌరవించడానికి తన సంగీతాన్ని ఓ మాధ్యమంగా వాడుకుంటున్నానని తప్పితే ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు.
బాధపెట్టాలని అనుకోలేదు...
సంగీతం ద్వారా అందరిని అలరించడం, సేవ చేయడమే తన లక్ష్యమని రెహమాన్ చెప్పారు. తన మాటల వెనుక ఉన్న ఉద్దేశం వేరని, వాటిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని రెహమాన్ అన్నారు. ఎవరిని బాధపెట్టాలన్నది తన అభిమతం కాదని పేర్కొన్నారు. తన నిజాయితీని అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకముందని తెలిపారు.
రామాయణ సినిమాకు మ్యూజిక్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చేసిన జల కాన్సెర్ట్, యువ నాగా లాండ్ మ్యూజిషియన్లతో చేసిన ఆర్కెస్ట్కాతో పాటు హన్స్ జిమ్మర్‌తో కలిసి రామాయణ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం లాంటివి మ్యూజిక్ డైరెక్టర్‌గా తన లక్ష్యాల్ని బలోపేతం చేస్తూ ముందుడుగు వేసేలా చేశాయని రెహమాన్ అన్నారు. గతాన్ని గౌరవిస్తూ వర్తమానాన్ని ఆనందోత్సాహాలతో గడుపుతూ భవిష్యత్తుకు స్ఫూర్తిగా నిలుస్తూ ముందుకు సాగుతున్నానని రెహమాన్ చెప్పారు. రెహమాన్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



