Ustaad Bhagat Singh | ఏపీలో ఉస్తాద్ భగత్‌సింగ్ టికెట్ రేట్ల పెంపు – బెనిఫిట్ షోలకు గ్రీన్‌సిగ్నల్
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ టికెట్ రేట్ల పెంపుతో బెనిఫిట్ షోకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలో పది రోజుల పాటు ఈ టికెట్ ధరల పెంపు అమలులో ఉంటుందని ప్రకటించింది.
Entertainment | Published On Mar 13, 2026, 8.00 pm IST
Ustaad Bhagat Singh | ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు లభించాయి. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. మార్చి 19న ఉదయం నాలుగు గంటలకు స్పెషల్ బెనిఫిట్ షోకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బెనిషిట్ షో టికెట్ ధరను ఐదు వందలుగా నిర్ణయించారు.
మార్చి 19న బెనిఫిట్ షోతో పాటు మరో ఐదు షోలను స్క్రీనింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మొదటి రోజు మొత్తం ఆరు షోలను థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.
సింగిల్ స్క్రీన్స్...మల్టీప్లెక్స్...
రిలీజ్ రోజు నుంచి పది రోజుల పాటు మల్టీప్లెక్స్‌తో పాటు సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్‌లో 125, సింగిల్ స్క్రీన్స్‌లో 100 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మార్చి 19 నుంచి 28 వరకు ధరల పెంపు అమలులో ఉంటుంది.
తెలంగాణలో...
తెలంగాణలో కూడా ఉస్తాద్ భగత్‌సింగ్ టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్లు రానున్నట్లు సమాచారం. 90 రోజుల నిబంధన జీవోపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉస్తాద్ భగత్‌సింగ్ నిర్మాతలు కలవబోతున్నట్లు సమాచారం.
ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్, తమన్ మ్యూజిక్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్
దళపతి విజయ్ తేరీ రీమేక్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతోన్నట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లను మేకర్స్ ఖండించారు. కాగా ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 15న హైదరాబాద్‌లో జరుగనున్నట్లు సమాచారం. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ntr | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్ – డ్రాగన్ టైటిల్ ఛేంజ్?
ఏప్రిల్ 21, 2026

Bhagyashri Borse | లవ్లెటర్కు భాగ్యశ్రీ బోర్సే క్రేజీ రియాక్షన్ – నెట్టింట వైరల్ అవుతోన్న పోస్ట్
ఏప్రిల్ 6, 2026

NTR | మహేష్ బాబు తర్వాత ఎన్టీఆర్ – డ్రాగన్ కోసం కళరియపట్టులో ట్రైనింగ్
ఏప్రిల్ 5, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



