NTR | మహేష్ బాబు తర్వాత ఎన్టీఆర్ – డ్రాగన్ కోసం కళరియపట్టులో ట్రైనింగ్
ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేరళ సంప్రదాయ యుద్ధ విద్య కళరియపట్టులో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. త్వరలో ప్రారంభమయ్యే నెక్స్ట్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కళరియపట్టు బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Apr 5, 2026, 3.12 pm IST
NTR | కథ డిమాండ్ చేస్తే ఎలాంటి రిస్క్‌లు తీసుకోవడానికైనా వెనుకాడటం లేదు నేటితరం అగ్ర హీరోలు. సెట్స్‌లో అడుగుపెట్టడానికి ముందే పాత్రకు తగ్గట్లుగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్.. లాంటి వాటిలో శిక్షణ తీసుకుంటున్నారు. డూప్‌లు ఉపయోగించకుండా రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజమౌళి వారణాసి కోసం మహేష్‌బాబు కేరళ సంప్రదాయ యుద్ధ విద్య కళరియపట్టులో ట్రైనింగ్ తీసుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా ఈ కళరియపట్టు నేర్చుకుంటున్నారట.
డ్రాగన్‌తో బిజీ...
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే జోర్డాన్‌లో నెల రోజుల పాటు కొంత టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
కళరియపట్టు బ్యాక్‌డ్రాప్‌లో...
ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. కళరియ పట్టు బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాని విధంగా చాలా డిఫరెంట్‌గా ఈ ఫైట్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ స్పెషల్‌గా కళరియపట్టులో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. కళరియపట్టు యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.
రుక్మిణి వసంత్ హీరోయిన్...
డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోన్నది. ఈ సినిమాలో మలయాళ హీరో టోవినో థామస్ విలన్‌గా నటించనున్నట్లు ఇన్నాళ్లుగా ప్రచారం జరిగింది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తాను డ్రాగన్ మూవీ నుంచి తప్పుకున్నట్లు పళ్లిచట్టంబి ప్రమోషన్స్‌లో టోవినో థామస్ వెల్లడించారు. అతడి ప్లేస్‌లో డ్రాగన్‌లో విలన్‌గా ఎవరూ నటించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
డ్రాగన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది జూన్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే వల్ల వాయిదాపడింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ntr | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్ – డ్రాగన్ టైటిల్ ఛేంజ్?
ఏప్రిల్ 21, 2026

Sara Arjun | కోలీవుడ్లోకి ధురంధర్ 2 హీరోయిన్ ఎంట్రీ – ధనుష్‌తో రొమాన్స్
ఏప్రిల్ 14, 2026

Alia Bhatt | ఆర్ఆర్ఆర్ తర్వాత మరో తెలుగు సినిమాలో ఆలియా – ఎన్టీఆర్ డ్రాగన్‌పై క్రేజీ రూమర్ వైరల్
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



