Anushka | వయసును ఎందుకు హైలైట్ చేస్తున్నారు – పెళ్లి రూమర్లపై అనుష్క టీమ్ క్లారిటీ
అనుష్క పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు గత కొద్ది రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఓ బిజినెస్‌మెన్‌తో స్వీటీ త్వరలోనే ఏడడుగులు వేయనున్నట్లు చెబుతున్నారు. ఈ పెళ్లి రూమర్లను అనుష్క టీమ్ ఖండించింది.
Entertainment | Published On Mar 19, 2026, 11.22 am IST
Anushka | స్విటీ అనుష్క శెట్టి పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు గత కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఓ బిజినెస్ మెన్‌తో అనుష్క పెళ్లిని కుటుంబసభ్యులు ఫిక్స్ చేశారని, ఈ వేసవిలోనే వివాహం జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 44 ఏళ్ల వయసులో అనుష్క పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వెడ్డింగ్ రూమర్లను అనుష్క టీమ్ ఖండించింది. వయసును హైలైట్ చేస్తూ ఏజ్ షేమింగ్‌కు పాల్పడటం సరికాదంటూ ఓ పోస్ట్ పెట్టారు.
ఏజ్ షేమింగ్...
ఒకరి వ్యక్తిగత జీవితాన్ని రోజువారీ వార్తలుగా మార్చే ముందు కనీసం అది నిజమా కాదా అన్నది ధృవీకరించుకుంటే బాగుంటుంది. నిజానిజాలు తెలియకుండా ఊహాగానాలను, పుకార్లను పదే పదే ప్రచారం చేయడం సరికాదు. అది ఎదుటివారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది.
ప్రతి పోస్ట్‌లో 44 ఏళ్లు అంటూ అనుష్క వయసును హైలైట్ చేస్తున్నారు. ఏజ్ ఏమైనా వివాదాస్పదమైన విషయమా?. ప్రతిసారి వయస్సు గురించి ప్రస్తావించడం ఒక రకమైన ఏజ్ షేమింగ్ లాగే అనిపిస్తోంది. వయస్సు అంత పెద్ద సమస్య అయితే... ఇదే ఆసక్తి హీరోల విషయంలో ఎందుకు చూపించడం లేదు. హీరోయిన్ల విషయంలోనే ఈ వివక్ష ఎందుకు కనిపిస్తుంది అని అనుష్క టీమ్ పేర్కొన్నారు.
నిర్ణయాన్ని గౌరవించాలి...
అనుష్క ఎంతో కష్టపడి... ప్రతిభ, గౌరవంతో ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమె ఎప్పుడూ పబ్లిసిటీ స్టంట్లు లేదా సోషల్ మీడియా పై ఆధారపడలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాలనుకునే ఆమె వంటి వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం చాలా అన్యాయం. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని 24 గంటలు ప్రజల ముందు ఉంచాలని అనుకోరు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది.
వ్యక్తిగత విషయం...
పెళ్లి అనేది ఒకరి వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూస్ కాదు, ట్రెండ్ అసలే కాదు. కేవలం ఎంగేజ్‌మెంట్ కోసం ఇలాంటి విషయాలను సంచలనం చేయకండి. బాధ్యత లేకుండా పుకార్లను వ్యాప్తి చేయద్దు. హీరోలకు ఇచ్చే అదే గౌరవాన్ని మహిళా నటులకు కూడా ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. అనుష్క టీమ్ క్లారిటీతో ఈ పెళ్లి పుకార్లకు పుల్‌స్టాప్ పడింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






