Anushka Shetty | ప్రపంచమే ఓ మాయ – అనుష్క మలయాళం డెబ్యూ మూవీ టీజర్ వచ్చేసింది – 15 భాషల్లో సినిమా రిలీజ్
కథనార్ మూవీతో అనుష్క శెట్టి మలయాళంలోకి తొలి అడుగు వేయబోతుంది. ఈ హారర్ ఫాంటసీ మూవీ టీజర్‌ను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ హంగులతో విజువల్ వండర్‌గా ఈ టీజర్ సాగింది. మొత్తం 15 భాషల్లో కథనార్ మూవీ రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Mar 31, 2026, 3.09 pm IST
Anushka Shetty | టాలీవుడ్‌లో అనుష్క ప్రభంజనం చాలా రోజులే కొనసాగింది. ఒకప్పుడు అనుష్క సినిమా వస్తుందంటే చాలు అంచనాలు ఓ రేంజ్‌లో ఉండేవి. కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బ్లాక్‌బస్టర్లు అందుకున్నది. ప్రయోగాలు పేరుతో అనుష్క చేసిన కొన్ని సినిమాలు ఆమె కెరీర్‌ను దెబ్బతీశాయి. తెలుగులో ఆఫర్లు తగ్గడంతో మలయాళంలో ఎంట్రీ ఇవ్వబోతుంది. కథనార్ పేరుతో ఫస్ట్ టైమ్ మాలీవుడ్‌లో ఓ హారర్ ఫాంటసీ మూవీ చేసింది.
టీజర్ రిలీజ్...
మలయాళ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న కథనార్ మూవీ టీజర్‌ను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు. ఫాంటసీ, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ హంగులతో విజువల్ వండర్‌లా ఈ టీజర్ సాగింది. ఇందులోని లోకేషన్స్, డైలాగ్స్, బ్యాక్‌డ్రాప్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయి. ఎవరి ఊహకు అందని...అందరూ ఆశ్చర్యంతో చూసేలా ఒక మాయజాలం, చూసినది...విన్నది ఏదీ రాదు..వచ్చేదొక్కటే, ఆపత్కాలంలో వచ్చే మహామనిషి అగ్ని ఒక్కటే... అంటూ టీజర్‌లోని డైలాగ్స్ ఆసక్తిని పంచుతున్నాయి.
గ్లామర్‌కు మించి...
ఆపదలో ఉన్న వేనాడ్ సామ్రాజ్యాన్ని ఓ యోధుడు ఎలా కాపాడాడు అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది. హీరో జయసూర్య క్యారెక్టర్, లుక్, అతడిపై వచ్చిన యాక్షన్ ఎపిసోడ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
నీల అనే అందమైన ఆత్మగా అనుష్క క్యారెక్టర్ టీజర్‌కు సర్‌ప్రైజింగ్‌గా నిలిచింది. గ్లామర్‌కు మించి అనుష్క పాత్రలో చాలా ట్విస్ట్‌లు ఉండబోతున్నట్లు చూపించి టీజర్‌ను ఎండ్ చేశారు.
ఈ మలయాళం మూవీలో అనుష్క నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. అనుష్క కెరీర్‌లో ఇదే తొలి మలయాళం మూవీ కావడం గమనార్హం.
పదిహేను భాషల్లో...
కథనార్ మూవీ మొత్తం పదిహేను భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. భారతీయ భాషలతో పాటు జపనీస్, ఫ్రెంచ్, చైనీస్, రష్యన్, ఇటాలియన్, కొరియన్ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. టీజర్‌లో మూవీ రిలీజ్ డేట్‌ను మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. ఈ హారర్ మూవీకి రొజీన్ థామన్ దర్శకత్వం వహించాడు. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో కథనార్ తెరకెక్కింది.
సంబంధిత వార్తలు

Dhanush kara | రైతు…దొంగగా మారితే – ధనుష్ కర తెలుగు టీజర్ రిలీజ్
ఏప్రిల్ 24, 2026

Ntr Dragon | ఎన్టీఆర్ డ్రాగన్‌లో విలన్‌గా బాలీవుడ్ హీరో – ప్రశాంత్ నీల్ ప్లానింగ్ వేరే లెవెల్
ఏప్రిల్ 11, 2026

Anushka Shetty | ఎట్టకేలకు థియేటర్లలోకి అనుష్క మలయాళం డెబ్యూ మూవీ – షూటింగ్ కోసమే మూడేళ్లు!
మార్చి 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



