Anushka vs Rashmika Mandanna | రష్మిక వర్సెస్ అనుష్క – మైసాకు పోటీగా జేజమ్మ మలయాళం మూవీ
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది. అదే రోజు అనుష్క మలయాళం డెబ్యూ మూవీ కథనార్ కూడా రిలీజ్ అవుతోన్నట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద రష్మిక మందన్న, అనుష్క పోరు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Anushka vs Rashmika Mandanna | బాక్సాఫీస్ వద్ద నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో అనుష్క పోటీపడబోతుంది. ఈ టాలీవుడ్ హీరోయిన్లు నటించిన సినిమాలు ఒకే రోజు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ది గర్లఫ్రెండ్ తర్వాత రష్మిక మందన్న నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో రష్మిక మందన్న నటిస్తోన్న తొలి సినిమా ఇది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న మైసాలో గిరిజన యువతిగా నేషనల్ క్రష్ కనిపించబోతుంది.
ఇటీవల మైసా టీజర్‌ను రిలీజ్ చేశారు.ఇందులో రష్మిక చేసిన రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
పాన్ ఇండియన్ లెవెల్‌లో...
మైసా మూవీ నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.
కథనార్...
మైసాకు పోటీగా అనుష్క మలయాళం డెబ్యూ మూవీ కథనార్ థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. పీరియాడికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను రివీల్ చేయనున్నారు.
విలన్‌గా...
కథనార్‌లో అనుష్క నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతుంది. నీల అనే ఆత్మ పాత్రలో నటిస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తోన్నాడు. రొజీన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్‌లాల్ గెస్ట్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో ప్రభుదేదా, సాండీ మాస్టర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైసా, కథనార్...రెండు సినిమాలపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. రష్మికకు అనుష్క బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఘాటీ తర్వాత..
గత ఏడాది రిలీజైన ఘాటి డిజాస్టర్‌తో తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అనుష్క. కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు తెలుగులో రణబాలి, మైసా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్న ఇటీవలే ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ranabaali | రణబాలి సినిమాపై డాక్యుమెంటరీ సిరీస్ – యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
సెప్టెంబర్ 27, 2026

Rashmika Mandanna | క్రష్ తగ్గడం లేదు – భర్తపై రష్మిక పోస్ట్ – విజయ్ క్యూట్ రిప్లై
సెప్టెంబర్ 24, 2026

Ranabaali | చూడముచ్చటగా విజయ్, రష్మిక కెమిస్ట్రీ – రణబాలి ఫస్ట్ సింగిల్ రిలీజ్
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●John Wesley | 13 కోట్ల ఓట్లను తొలగించడానికి జ్ఞానేశ్ కుమారే కారణం
- ●Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు
- ●Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్
- ●Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ
- ●Asaduddin Owaisi | ఆ సూపరింటెండెంట్ లంచాలు తీసుకొని రౌడీషీటర్లను వదులుతున్నరు
- ●KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం

John Wesley | 13 కోట్ల ఓట్లను తొలగించడానికి జ్ఞానేశ్ కుమారే కారణం

Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు

Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్

Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ



