త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Files | అద్దంకి ద‌యాక‌ర్ హీరోగా `ఇండియా ఫైల్స్`.. అమెరికాలో ఘనంగా టీజర్ లాంచ్

India Files | బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు బొమ్మకు మురళి దర్శకత్వంలో, అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం `ఇండియా ఫైల్స్` (India Files). ద‌స‌రా సంద‌ర్భంగా అమెరికాలోని టాంపా న‌గ‌రంలో ఈ సినిమా టీజ‌ర్‌ను ఘనంగా విడుద‌ల చేశారు.

G

Entertainment | Published On Oct 23, 2026, 12.29 pm IST

India Files | అద్దంకి ద‌యాక‌ర్ హీరోగా `ఇండియా ఫైల్స్`.. అమెరికాలో ఘనంగా టీజర్ లాంచ్
Advertisement

India Files | త్రినేత్ర న్యూస్‌: బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు బొమ్మకు మురళి దర్శకత్వంలో, అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం `ఇండియా ఫైల్స్` (India Files). భారతదేశ సాంస్కృతిక విశిష్టతను, మూలాలను (Cultural DNA) ప్రతిబింబించేలా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి ( MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం సహా ఐదు భాషల్లో అత్యంత భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ,

తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరం వేదికగా ఇండియా ఫైల్స్ చిత్రానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల టీజర్ లాంచ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. విజయ దశమి (Dasara) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రవాస భారతీయుల సమక్షంలో ఈ టీజర్‌ను (Teaser) ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్.. ఎన్ఆర్‌ఐల సమక్షంలో టీజర్‌ను ఆవిష్కరించారు. దసరా శుభవేళ వెలువడిన ఈ టీజర్‌పై ఎన్ఆర్‌ఐలు విశేష హర్షం వ్యక్తం చేశారు. ఎంఎం. కీరవాణి అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కొనియాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ దసరా పండుగ రోజున మన సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా వస్తున్న ఈ చిత్రాన్ని అభినందించారు.

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, మూలాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ కథాంశం ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. దసరా పండుగ సందర్భంగా ప్రవాస భారతీయుల నుంచి లభించిన అపారమైన ఆదరణ, విశేష స్పందన పట్ల దర్శకుడు బొమ్మకు మురళి (Bommaku Murali ), నిర్మాత, నటుడు, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఎఆర్ఐ బృందానికి దసరా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు బొమ్మకు క్రియేషన్స్ చిత్ర బృందం పేర్కొంది.

Advertisement
Advertisement