త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anushka Shetty | ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి అనుష్క మ‌ల‌యాళం డెబ్యూ మూవీ – షూటింగ్ కోస‌మే మూడేళ్లు!

అనుష్క శెట్టి మ‌ల‌యాళం డెబ్యూ మూవీ క‌థ‌నార్ షూటింగ్ మొద‌లైన మూడేళ్ల త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మే 27న ఈ హార‌ర్ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో నీలి అనే య‌క్షిణి పాత్ర‌లో అనుష్ క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On Mar 9, 2026, 6.37 pm IST

Anushka Shetty | ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి అనుష్క మ‌ల‌యాళం డెబ్యూ మూవీ – షూటింగ్ కోస‌మే మూడేళ్లు!
Advertisement

Anushka Shetty |  ఓ సినిమా మొద‌లైన ఆరు నెల‌లు, ఏడాదిలోపే షూటింగ్‌ను పూర్తిచేసి థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తుంటారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. స్టార్ హీరో సినిమా అయితే రెండేళ్ల వ‌ర‌కు టైమ్ ప‌డుతుంది. కానీ అనుష్క శెట్టి మ‌ల‌యాళం డెబ్యూ క‌థ‌నార్ షూటింగ్ కోస‌మే మేక‌ర్స్ మూడేళ్లు టైమ్ కేటాయించారు. 2023లో లాంఛ్ అయిన‌ ఈ మూవీ 2026లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

మ‌ల‌యాళంలోకి ఎంట్రీ...

పీరియాడిక‌ల్ హార‌ర్‌ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న క‌థ‌నార్‌తోనే అనుష్క మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. జ‌య‌సూర్య హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు రొజీన్ థామ‌స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 9వ శ‌తాబ్దానికి చెందిన క్రిస్టియ‌న్‌ ప్రీస్ట్ క‌డ‌మ‌ట్ట‌త్తు క‌థ‌నార్ జీవితం ఆధారంగా ఈ మ‌ల‌యాళం మూవీ రూపొందుతోంది. 2023లో క‌థ‌నార్ మూవీ లాంఛ్ అయ్యింది. ఇటీవ‌ల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోనే అత్య‌ధిక కాలం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న సినిమాగా క‌థ‌నార్ నిలిచింది.

రిలీజ్ డేట్‌...

తాజాగా క‌థ‌నార్‌ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యిన‌ట్లు టాక్‌. మే 27న ఈ హార‌ర్ మూవీ థియేట‌ర్ల‌లోకి రానుంద‌ట‌. భార‌తీయ భాష‌ల‌తో పాటు ఇంగ్లీష్, చైనీస్‌, ఫ్రెంచ్‌, కొరియ‌న్‌తో పాటు మ‌రికొన్ని విదేశీ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. దాదాపు 90 కోట్ల‌తో మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా క‌థ‌నార్ తెర‌కెక్కుతోంది.

విల‌న్‌గా....

కాగా ఈ మ‌ల‌యాళ డెబ్యూ మూవీలో అనుష్క విల‌న్‌గా క‌నిపించ‌బోతుంది. నీలి అనే య‌క్షిణిగా నెగెటివ్ షేడ్స్‌తో ప‌వ‌ర్‌ఫుల్‌గా అనుష్క పాత్ర సాగుతుంద‌ని అంటున్నారు. కేర‌ళ జాన‌ప‌దాల్లో ఫేమ‌స్ అయిన క‌ల్లియంక‌ట్టు నీలి అనే క్యారెక్ట‌ర్‌లో అనుష్క న‌టిస్తుంద‌ని అంటున్నారు. అందంగా క‌నిపించే ఈ య‌క్షిణికి ఎన్నో అతీంద్రియ శ‌క్తులు ఉంటాయి. ఈ య‌క్షిణి బారి నుంచి ప్ర‌జ‌ల‌ను క‌డ‌మ‌ట్ట‌త్తు క‌థ‌నార్ ఎలా కాపాడాడు అనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లుగా స‌మాచారం.
క‌థ‌నార్ మూవీలో మ‌ల‌యాళం అగ్ర న‌టుడు మోహ‌న్‌లాల్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement