Anushka | హారర్ కామెడీ కథతో అనుష్క కమ్‌బ్యాక్ – రెండేళ్ల తర్వాత కొత్త సినిమాకు జేజమ్మ గ్రీన్‌సిగ్నల్
అనుష్క తెలుగులో సినిమా చేసి రెండేళ్లు దాటిపోయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఘాటి తర్వాత కొత్త సినిమా ఏది అంగీకరించలేదు జేజమ్మ. తాజాగా అనుష్క ఓ హారర్ కామెడీ మూవీతో టాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరంటే?
Entertainment | Published On Sep 1, 2026, 5.06 pm IST
Anushka | అనుష్కకు హారర్ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అరుంధతి ఆమె కెరీర్‌లోనే కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. భాగమతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తనకు అచ్చొచ్చిన హారర్ జానర్‌లో అనుష్క మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో రెండేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి పునరాగమనం చేయబోతుంది.
క్రిష్ ఘాటి...
గత ఏడాది ఘాటితో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. క్రిష్ దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఘాటి రిజల్ట్‌తో నెక్స్ట్ సినిమాల విషయంలో అనుష్క ఆచితూచి అడుగులు వేస్తోంది.
కమ్‌బ్యాక్...
దాదాపు రెండేళ్లు అయినా కొత్త సినిమాను ప్రకటించకపోవడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఎట్టకేలకు అనుష్క ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జాతిరత్నాలు ఫేమ్...
అనుష్క రీఎంట్రీ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హారర్, కామెడీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అనుదీప్ రాసిన కథ నచ్చడంతో జేజమ్మ ఈ సినిమాకు ఒకే చెప్పినట్లు సమాచారం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మలయాళంలో...
ప్రస్తుతం కథనార్ పేరుతో మలయాళంలో అనుష్క ఓ సినిమా చేస్తోంది. హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతోనే మాలీవుడ్‌లోకి తొలి అడుగు వేయబోతుంది. జయసూర్య హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మూడేళ్లుగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. మలయాళ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
సెప్టెంబర్ 4, 2026

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



