Anupama Parameswaran | డీ గ్లామర్ పాత్రలో అనుపమ – ఆగిపోయిందనుకున్న మూవీ థియేటర్లలోకి….
నాలుగేళ్ల క్రితం షూటింగ్ మొదలైన అనుపమ పరమేశ్వరన్ తెలుగు మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతుంది. అనుపమ పరమేశ్వరన్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తోన్న మరీచిక త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అనుపమ డీ గ్లామర్ రోల్ చేస్తోంది.
Entertainment | Published On May 14, 2026, 7.51 am IST
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్, రెజీనా హీరోయిన్లుగా నాలుగేళ్ల క్రితం మరీచిక పేరుతో ఓ మూవీ మొదలైంది. సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ హీరోగా నటించబోతున్నట్లు ప్రకటించారు. 2022లో ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మరీచికను అందరూ మర్చిపోయారు. ఆగిపోయిందని అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదట. త్వరలోనే మరీచిక థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో డీ గ్లామర్ లుక్‌లో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. కట్టుడుపళ్లు, కళ్లద్ధాలు ధరించి డిఫరెంట్‌గా ఆమె క్యారెక్టర్ ఉండటం ఆసక్తిని పంచుతోంది.
రొమాంటిక్ థ్రిల్లర్...
ప్రేమ, ద్రోహం ప్రతీకారం అనే అంశాలతో ముడిపడిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇదని సమాచారం. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందిస్తుండటం గమనార్హం. రైటర్ లక్ష్మీభూపాల కథ, మాటలు, పాటలు అందిస్తూనే ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరీచికతో దాదాపు నాలుగేళ్ల తర్వాత రెజీనా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. చివరగా తెలుగులో 2022లో రిలీజైన ఉత్సవం సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.
తెలంగాణ యువతిగా...
ప్రస్తుతం టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్ ఫుల్ బిజీగా ఉంది. భోగితో పాటు క్రేజీ కళ్యాణం సినిమాలు చేస్తోంది. ఈ రెండింటిలో తెలంగాణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతుండటం గమనార్హం. ఈ ఏడాదే భోగి, క్రేజీ కళ్యాణం థియేటర్లలోకి రానున్నాయి.
సంబంధిత వార్తలు

Ilaiyaraaja | కాపీ రైట్ వివాదం కేసు.. ఢిల్లీ హైకోర్టులో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు షాక్..!
జులై 1, 2026

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ – సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
జూన్ 19, 2026

Anupama Parameswaran | యాక్టింగ్‌కు పనికిరానని రిజెక్ట్ చేశారు – కన్నీళ్లు ఆగలేదు – అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



