Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం – డ్రాగన్ షూటింగ్‌కు రెండు నెలలు బ్రేక్
డ్రాగన్ షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయనకు ట్రీట్‌మెంట్ జరిగింది. ఈ గాయం నుంచి ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు టైమ్ పడుతుందని వైద్య బృందం ప్రకటించారు. అప్పటివరకు డ్రాగన్ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడనున్నట్లు సమాచారం.
Entertainment | Published On Jul 28, 2026, 3.38 pm IST
Jr Ntr | టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా ప్రమాదాల బారిన పడటం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. పెద్ది షూటింగ్‌లో గాయపడ్డ రామ్‌చరణ్‌కు సోమవారం కోయంబత్తూరులో సర్జరీ జరిగింది. ఎన్‌బీకే 111 మూవీ షూటింగ్‌లో ఫైట్ సీన్ తీస్తుండగా బాలకృష్ణ జారిపడ్డారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న పవన్ కళ్యాణ్ ఇటీవలే ముంబైలో సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఎనిమిది వారాలు...
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదం బారిన పడ్డారు. డ్రాగన్ షూటింగ్‌లో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. హుటాహుటినా మేకర్స్ ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎన్టీఆర్ భుజం గాయానికి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్‌ను వివరిస్తూ ఆయన టీమ్ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు
ఎన్టీఆర్...రుక్మిణి వసంత్...
ఎన్టీఆర్ గాయం కారణంగా డ్రాగన్ షూటింగ్‌కు రెండు నెలల వరకు ఆగిపోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా షెడ్యూల్‌లో ఆర్ఎఫ్‌సీలో ఎన్టీఆర్, రుక్మిణి వసంత్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. లావిష్‌గా వేసిన ఓ సెట్‌లో దాదాపు వంద మందికిపైగా జూనియర్ ఆర్టిస్ట్‌లతో షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ గాయపడటంతో షూటింగ్‌ను మేకర్స్ నిలిపివేశారు. ఆయన కోలుకున్న తర్వాతే తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది...
ఈ ఏడాది జూన్‌లోనే డ్రాగన్ రిలీజ్ కావాల్సింది. కానీ ఓ యాడ్ షూటింగ్‌లో ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగలడంతో షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు మరోసారి ఆయన గాయపడటంతో వచ్చే ఏడాది అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అన్నది అనుమానంగా మారింది. డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కపూర్, బిజు మీనన్ ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి
- ●Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు
- ●Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంటవ్ రేవంత్?
- ●Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..
- ●Kajal Aggarwal | కాజల్‌కు అచ్చిరాని బాలీవుడ్ - చందమామ ఖాతాలో మరో డిజాస్టర్
- ●Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..

MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి

Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు

Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంటవ్ రేవంత్?

Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..






