Anupama Parameswaran | డీ గ్లామర్ లుక్‌లో అనుపమ – శర్వానంద్ భోగి నుంచి సర్‌ప్రైజ్ అప్‌డేట్
శర్వానంద్ భోగి నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తెలంగాణ గ్రామీణ యువతిగా డీ గ్లామర్ లుక్‌లో అనుపమ కనిపిస్తోంది.
Entertainment | Published On Apr 30, 2026, 11.59 am IST
Anupama Parameswaran |టాలీవుడ్ హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ రూటే సఫరేటు. కథ, పాత్రల పరంగా ప్రతి సినిమాలో కొత్తదనం, వైవిధ్యతతో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. ఓ సారి చేసిన పాత్రను మరోసారి రిపీట్ చేయడానికి ఇష్టపడదు. తాజాగా భోగి సినిమాలో డీ గ్లామర్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతుంది.
ఫస్ట్ లుక్ రిలీజ్...
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా భోగి తెరకెక్కుతోంది. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దుల్లో సాగే కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు.
తెలంగాణ గ్రామీణ యువతిగా...
ఈ పోస్టర్‌లో కంప్లీట్ డిఫరెంట్ గెటప్‌లో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. లంగా ఓణీ, చేతులకు కడియాలు ధరించి తెలంగాణ గ్రామీణ యువతిగా డీ గ్లామర్ లుక్‌లో అనుపమ అభిమానులను ఆకట్టుకుంటోంది. మోదుగు ఆకులతో నిండిన ఓ బుట్ట నెత్తిన పెట్టుకొని....చేతికి తగిలించి ఉన్న టిఫిన్ బాక్స్‌తో అనుపమ లుక్ ఆసక్తిని పంచుతోంది. బ్యాక్‌డ్రాప్‌లో మట్టిఇళ్లు, పశువుల కంచెలతో పల్లె వాతావరణం కనిపిస్తోంది. మోదుగు ఆకులతో విస్తార్లు తయారు చేసి జీవనం సాగించే యువతిగా అనుపమ రోల్ రా అండ్ రస్టిక్‌గా సాగుతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా కోసం తెలంగాణ యాసను అనుపమ నేర్చుకుందట.
కందుల సులోచన రాణి...
భోగి మూవీలో అనుపమ పరమేశ్వరన్ కందుల సులోచన రాణి పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1960 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గంగా అనే పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన శర్వానంద్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాలో డింపుల్ హయతి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే రంపచోడవరం, మారేడుమిల్లిలో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుకాబోతుంది. రక్షా బంధన్ కానుకగా ఆగస్ట్ 28న భోగి థియేటర్లలోకి రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



