GST | జీఎస్టీ వసూళ్లలో భారీ జంప్.. జూలైలో రూ.2.11 లక్షల కోట్లతో రికార్డు..
GST | భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూలై నెలలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూలైలో స్థూల జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 15.4 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది అత్యంత బలమైన నెలవారీ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.
GST | భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూలై నెలలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూలైలో స్థూల జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 15.4 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది అత్యంత బలమైన నెలవారీ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. దేశీయ లావాదేవీలు బలంగా ఉండటంతోపాటు దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రిఫండ్‌లను మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 15.8 శాతం పెరిగి రూ.1.81 లక్షల కోట్లకు చేరాయి. జూలైలో దేశీయ జీఎస్టీ వసూళ్లు 10.1 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు దిగుమతులపై జీఎస్టీ ఆదాయం 28.8 శాతం పెరిగి రూ.66,511 కోట్లకు చేరుకుంది. ఇది దేశీయ డిమాండ్ బలంగా ఉండటంతోపాటు దిగుమతి కార్యకలాపాలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని సూచిస్తోంది.
నికర జీఎస్టీ ఆదాయం రూ.1.27 లక్షల కోట్లు..
ఈ నెలలో మొత్తం జీఎస్టీ రిఫండ్‌లు 13.1 శాతం పెరిగి రూ.29,968 కోట్లకు చేరాయి. రిఫండ్‌ల అనంతరం దేశీయ నికర జీఎస్టీ ఆదాయం 10.5 శాతం పెరిగి రూ.1.27 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై నికర జీఎస్టీ ఆదాయం 30.3 శాతం పెరిగి రూ.54,223 కోట్లుగా నమోదైంది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు ఏప్రిల్ నుంచి జూలై వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు 10.1 శాతం పెరిగి రూ.8.42 లక్షల కోట్లకు చేరాయి. ఇదే కాలంలో నికర జీఎస్టీ ఆదాయం 9.2 శాతం పెరిగి రూ.7.21 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ జీఎస్టీ వసూళ్లు 4.5 శాతం పెరిగి రూ.5.99 లక్షల కోట్లుగా ఉండగా, దిగుమతులపై జీఎస్టీ ఆదాయం 26.9 శాతం పెరిగి రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. హర్యానా అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. అక్కడ జూలైలో జీఎస్టీ వసూళ్లు 25 శాతం పెరిగి రూ.11,892 కోట్లకు చేరాయి. గుజరాత్‌లో వసూళ్లు 19 శాతం పెరిగి రూ.12,923 కోట్లకు చేరగా, తెలంగాణలో కూడా 19 శాతం వృద్ధితో రూ.5,819 కోట్ల జీఎస్టీ వసూలైంది.
28 ప్రాంతాల్లో సానుకూల వృద్ధి..
ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ భాగస్వామి వివేక్ జలాన్ మాట్లాడుతూ భారత జీఎస్టీ వసూళ్లు దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. దేశీయ ఆదాయాలు స్థూలంగా 10.1 శాతం, నికరంగా 10.5 శాతం పెరగడం అంతర్గత వినియోగం, పన్ను చెల్లింపుల్లో మెరుగైన అనుసరణకు నిదర్శనమని చెప్పారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 28 ప్రాంతాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయని, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాలు రెండంకెల వృద్ధిని సాధించడం భారత పన్ను వ్యవస్థ విస్తరణను, మార్కెట్ బలాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ అప్పీళ్ల ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ)లో దాఖలయ్యే అప్పీళ్లకు జూలై 31 వరకు ప్రీ-డిపాజిట్ చెల్లించాల్సిన నిబంధన కూడా ఆదాయ వృద్ధికి దోహదపడిందని ఆయన తెలిపారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సెక్షన్ 73 నోటీసులకు సెప్టెంబర్ 30 గడువు, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సెక్షన్ 74 నోటీసులకు ఆగస్టు 31 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ముందుగానే అనుసరణ చేపట్టడం వల్ల కూడా ఆదాయం పెరిగిందని చెప్పారు. ఈ అంశాలు ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణతోపాటు సాంకేతికత ఆధారిత పారదర్శక జీఎస్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని వివేక్ పేర్కొన్నారు.
ఏపీలో 5 శాతం తగ్గిన వసూళ్లు..
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే పంజాబ్, కేరళ రాష్ట్రాలు చెరో 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరిగి రూ.9,651 కోట్లకు చేరాయి. దేశంలో అత్యధిక జీఎస్టీ వసూలు చేసే మహారాష్ట్రలో 13 శాతం వృద్ధితో రూ.32,210 కోట్ల ఆదాయం నమోదైంది. కర్ణాటకలో 12 శాతం పెరిగి రూ.13,854 కోట్లకు చేరగా, ఢిల్లీలో 8 శాతం వృద్ధితో రూ.6,460 కోట్ల జీఎస్టీ వసూలైంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 22 శాతం క్షీణత నమోదవగా, ఉత్తరాఖండ్‌లో 18 శాతం, పుదుచ్చేరిలో 17 శాతం, మధ్యప్రదేశ్‌లో 10 శాతం, మిజోరంలో 7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం, తమిళనాడులో 1 శాతం మేర వసూళ్లు తగ్గాయి. జూలై నెల గణాంకాలు 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభంలో దేశ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. దేశీయ జీఎస్టీ వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధితోపాటు దిగుమతులపై జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరగడం వల్ల మొత్తం పరోక్ష పన్నుల ఆదాయం బలపడినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kiara Advani | నా ఐస్క్రీమ్లు దొంగతనం చేసేది నువ్వే - కియారా అద్వానీకి ఫన్నీగా బర్త్డే విషెస్ చెప్పిన బాలీవుడ్ హీరో
- ●PM Modi | దేశ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి.. 12 ఏళ్లలో 166 ఎయిర్పోర్టులు : ప్రధాని మోదీ
- ●Ramchandar Rao | E20 పెట్రోల్ పూర్తి సురక్షితం.. నిర్భయంగా పోయించుకోండి
- ●Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?
- ●TGBIE | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం
- ●Abhijeet Dipke | రీల్లోనే క్షమిస్తారా.. కేసులను కూడా ఎత్తివేస్తారా..? ప్రధాని మోదీ వీడియోపై అభిజీత్ దిప్కే వ్యంగ్యాస్త్రాలు

Kiara Advani | నా ఐస్క్రీమ్లు దొంగతనం చేసేది నువ్వే - కియారా అద్వానీకి ఫన్నీగా బర్త్డే విషెస్ చెప్పిన బాలీవుడ్ హీరో

PM Modi | దేశ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి.. 12 ఏళ్లలో 166 ఎయిర్పోర్టులు : ప్రధాని మోదీ

Ramchandar Rao | E20 పెట్రోల్ పూర్తి సురక్షితం.. నిర్భయంగా పోయించుకోండి

Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?






