త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | షూటింగ్‌లో ర‌ష్మిక మంద‌న్న‌కు గాయం – ఆరు వారాలు సినిమాల‌కు బ్రేక్‌

షూటింగ్‌లో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న గాయ‌ప‌డింది. డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తోండ‌గా కింద‌ప‌డ‌టంతో తుంటి భాగంలో బ‌ల‌మైన గాయ‌మైన‌ట్లు స‌మాచారం. ఆరు వారాల వ‌ర‌కు ర‌ష్మిక‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు సూచించిన‌ట్లు తెలిసింది.

N

Entertainment | Published On Jul 31, 2026, 6.48 pm IST

Rashmika Mandanna | షూటింగ్‌లో ర‌ష్మిక మంద‌న్న‌కు గాయం  – ఆరు వారాలు సినిమాల‌కు బ్రేక్‌
Advertisement

Rashmika Mandanna |టాలీవుడ్ స్టార్స్ వ‌రుస‌గా ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ‌, రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌లు మ‌రువ‌క‌ముందే తాజాగా టాలీవుడ్‌లో మ‌రో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ సినిమా షూటింగ్‌లో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న తీవ్రంగా గాయ‌ప‌డింది. డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తోండ‌గా కింద ప‌డ‌టంతో ర‌ష్మిక తుంటి భాగంలో బ‌ల‌మైన గాయ‌మైన‌ట్లు తెలిసింది.

ఆరు వారాలు గ్యాప్‌...

షూటింగ్‌ను నిలిపివేసిన చిత్ర‌బృందం ర‌ష్మిక మంద‌న్న‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ అనంత‌రం ఆరు వారాల వ‌ర‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించిన‌ట్లు స‌మాచారం. గ్యాప్ లేకుండా వ‌రుస‌గా యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, డ్యాన్స్ ప‌ర్‌ఫ‌ర్మెన్స్‌లు చేయ‌డం వ‌ల్లే గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించిన‌ట్లు చెబుతున్నారు. ర‌ష్మిక కోలుకోవ‌డానికి రిహాబిలిటేష‌న్ కూడా అవ‌స‌ర‌మ‌ని సూచించిన‌ట్లు తెలిసింది. ప్ర‌మాదం కార‌ణంగా ర‌ష్మిక షూటింగ్‌ల‌కు బ్రేక్ ప‌డ‌నుంది.

ర‌ణ‌బాలితో పాటు...

ప్ర‌స్తుతం తెలుగులో భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ర‌ణ‌బాలి సినిమా చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పెళ్లి త‌ర్వాత విజ‌య్‌, ర‌ష్మిక కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో ఆంగ్లేయుల‌ను ఎదురించిన పోరాడిన రాయ‌ల‌సీమ యోధుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపిస్తోండ‌గా...జ‌య‌మ్మ పాత్ర‌ను ర‌ష్మిక పోషిస్తోంది. ర‌ణ‌బాలితో పాటు తెలుగులో మైసా పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది ర‌ష్మిక‌. ఇందులో గోండు యువ‌తిగా క‌నిపించ‌బోతుంది.
ఇవే కాకుండా మ‌రో రెండు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తోంది. అంతే కాకుండా 30 వ‌ర‌కు బ్రాండ్స్‌కు అంబాసిడ‌ర్‌గా ర‌ష్మిక వ్య‌వ‌హ‌రిస్తోంది.

 

Advertisement
Advertisement