Ritika Nayak | పవర్‌పేట నుంచి పడమట వీధి జానకి వచ్చేసింది – మిరాయ్ హీరోయిన్‌తో సందీప్‌కిషన్ రొమాన్స్
సందీప్ కిషన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట పేరుతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మేకర్స్ రివీల్ చేశారు. మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ కథానాయికగా కనిపించబోతున్నట్లు ప్రకటించారు.
Entertainment | Published On Oct 27, 2026, 8.58 pm IST
Ritika Nayak | అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీతో తొలి అడుగులోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఢిల్లీ బ్యూటీ రితికా నాయక్. ఆ తర్వాత మిరాయ్, కొరియన్ కనకరాజుతో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. తాజాగా రితికానాయక్ తెలుగులో మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయబోతుంది.
పవర్ పేట...
సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. ప్రేమ, గౌరవం, రాజకీయ అంశాలతో ముడిపడిన ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతోంది. సగానికిపైగా చిత్రీకరణ పూర్తయ్యింది. అయినా హీరోయిన్ ఎవరన్నది మేకర్స్ రివీల్ చేయకపోవడం ఆసక్తిని రేకెత్తించింది.
పడమటవీధి జానకి...
ఎట్టకేలకు ఈ సీక్రెట్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రకటించారు. మంగళవారం రితికానాయక్ బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పడమటవీధి జానకి అనే పాత్రలో రితికా నాయక్ కనిపించబోతున్నట్లు పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పాతకాలపు ఇంట్లో చెక్క బెంచీపై హుందాగా కూర్చొని ఉంది. క్రీమ్ కలర్ హాఫ్ సారీ, పీచ్ కలర్ దుపట్టా, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పాటు సంప్రదాయ ఆభరణాలు, ఉంగరాల జుట్టు ట్రెడిషనల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంది. పోస్టర్‌తో పాటు ఓ వీడియో గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో గ్లామరస్‌గా కనిపించింది.
షూటింగ్ కంప్లీట్...
పవర్ పేట షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. తొలుత ఈ సినిమాను నితిన్‌తో అనౌన్స్ చేశారు డైరెక్టర్ కృష్ణచైతన్య. కానీ ఫెయిల్యూర్స్ కారణంగా నితిన్ తప్పుకోవడంతో అతడి స్థానంలో సందీప్ కిషన్ హీరోగా పవర్‌పేటలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సందీప్ కిషన్ సేనాపతి రవి అనే మాస్ రోల్‌లో కనిపించబోతున్నాడు. మూడు డిఫరెంట్ షేడ్స్‌లో అతడు కనిపించబోతున్నట్లు సమాచారం.
పవర్ పేట సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్. రామకృష్ణ, మోనికా ప్రొడక్షన్ డిజైనర్లుగా పనిచేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | హిట్లు లేకపోయినా తగ్గేదేలే – మళ్లీ బిజీ అవుతోన్న శ్రీలీల
అక్టోబర్ 27, 2026

Keerthy Suresh | డబ్బులు నష్టపోవాలని అనుకోవడం లేదు – ప్రొడ్యూసర్‌గా మారడంపై కీర్తి సురేష్ క్లారిటీ
అక్టోబర్ 27, 2026

Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో – టైటిల్ ఇదే – ఫస్ట్ గెస్ట్‌లు ఎవరంటే?
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Telangana Drought Mandals List 2026 | తెలంగాణలో 365 కరువు మండలాలు: 31 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం.. ఇదిగో లిస్ట్
- ●బీఆర్ఎస్ ప్రశ్నల వేళ కేసుల కదలిక.. యాదృచ్ఛికమా? రాజకీయ వ్యూహమా?
- ●Vande Bharat Sleeper | మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
- ●Saudi Arabia Houthi Deal | యుద్ధం ఆపేందుకు రూ.8,400 కోట్లు?: హౌతీలతో సౌదీ సీక్రెట్ డీల్.. తెరవెనుక ఇరాన్ చక్రం!
- ●Tiger Shroff Firing Case | టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక పరిణామం.. నిందితులందరిపై మోకా చట్టం!
- ●Kannada Producer | కన్నడ అగ్ర నిర్మాత సిల్క్మంజు కన్నుమూత - సినిమాలు తీసి - అప్పుల పాలై...

Telangana Drought Mandals List 2026 | తెలంగాణలో 365 కరువు మండలాలు: 31 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం.. ఇదిగో లిస్ట్

బీఆర్ఎస్ ప్రశ్నల వేళ కేసుల కదలిక.. యాదృచ్ఛికమా? రాజకీయ వ్యూహమా?

Vande Bharat Sleeper | మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Saudi Arabia Houthi Deal | యుద్ధం ఆపేందుకు రూ.8,400 కోట్లు?: హౌతీలతో సౌదీ సీక్రెట్ డీల్.. తెరవెనుక ఇరాన్ చక్రం!



