Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ – డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?
అతి అనుమానాల వల్ల తలెత్తే అనర్థాలను అనుమాన పక్షి మూవీలో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలని అనుకున్నారు డైరెక్టర్. కానీ ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఆరంభం నుంచి చివరి వరకు ఈ సినిమా ఆడియెన్స్ సహనానికి పరీక్షగా మారింది.
Entertainment | Published On Sep 25, 2026, 8.18 pm IST
Anumana pakshi Review | అతి అనుమానాలు, ఆలోచనలు ఎప్పుడూ అనర్థదాయకమే. సడెన్‌గా ఫ్యాన్ ఊడిపోయి కిందపడిపోతే... ఓపెన్ చేసిన కిటికీలో నుంచి పాము వచ్చి కాటేస్తే...ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్...మెసేజ్ వస్తే స్కామ్‌లో ఇరుక్కుపోయామని అనిపిస్తే...ఇలాంటి ఆలోచనలు, అనుమానాలు చాలా మందిలో కనిపిస్తాయి. కానీ తమలోని భయాలను లోలోపల అణిచిపెట్టుకొని పైకి మాత్రం కొందరు డాంబీకంగా బతుకుతుంటారు. మరికొందరు మాత్రం బయటకు వ్యక్తం చేస్తుంటారు. వాటివల్ల తాము ఇబ్బందులు పడుతూ ఎదుటివారికి మనశ్శాంతి లేకుండా చేస్తారు. అలాంటి టిఫికల్ మెంటాలిటీ ఉన్న ఓ వ్యక్తి కథను అనుమాన పక్షి మూవీలో ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు డైరెక్టర్ మల్లిక్‌రామ్.
యూట్యూబర్ అనుమానాలు
సన్నీ ఓ యూట్యూబర్. అనుమానాలు ఎక్కువ. అందుకు తగ్గట్లే తన యూట్యూబ్ ఛానెల్‌కు అనుమానపక్షి అనే పేరు పెట్టుకుంటాడు. తన అనుమానలతో పక్కవారి జీవితాలతో ఆడుకుంటాడు. సన్నీ కారణంగా ఓ స్నేహితుడి బిజినెస్ లాసవుతుంది. జైలు పాలవుతాడు. సన్నీపై రివేంజ్ తీర్చుకోవడానికి అతడిని కశ్మీర్ రప్పిస్తాడు. తన స్వార్థం కోసం వర్మ అనే స్నేహితుడిని కూడా కశ్మీర్ తీసుకుపోతాడు సన్నీ.
అక్కడ సన్నీకి కన్య పరిచయమవుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కన్య కూడా సన్నీని ఇష్టపడుతుంది. తన తండ్రికి అతడిని పరిచయం చేస్తుంది. పెళ్లికి ఒకే అనుకుంటున్న తరుణంలోనే సన్నీ రూమ్‌లో వర్మ డెడ్‌బాడీ దొరుకుతుంది. హనీమూన్ కోసం కశ్మీర్ వచ్చిన సీఐ వాసు..ఈ హత్య సన్నీనే చేసి ఉంటాడని అనుమానిస్తాడు. అతడి అనుమానం నిజమైందా? అసలు వర్మ ఎలా చనిపోయాడు? అతడి డెడ్‌బాడీ సన్నీ రూమ్‌లోకి ఎలా వచ్చింది? ఈ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? ప్రేమ పేరుతో సన్నీని కన్య ఎలా మోసం చేసింది అన్నదే అనుమాన పక్షి మిగిలిన కథ.
డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయితే...
ఓ సినిమాకు కర్త, కర్మ క్రియ దర్శకుడే. అతడి ఆలోచనలు, ఊహల నుంచే సినిమా పడుతుంది. తెరపై పాత్రల ఆటలు, పాటలు, డైలాగ్‌లు అన్నింటి వెనుక దర్శకుడే ఉంటాడు. ఓ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ప్రభావం కూడా దర్శకులపైనే ఎక్కువగా ఉంటుంది. సినిమా తీయడంలో దర్శకుడు తడబడితే సినిమా మొత్తం కంగాళీగా మారిపోతుంది. అందుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా అనుమాన పక్షి మూవీ నిలుస్తుంది.
జానర్ ఏమిటి....
అసలు దర్శకుడు ఈ సినిమాతో ఏం చెప్పాలని అనుకున్నాడు...కథ...జానర్ ఏమిటి అన్నది చివరి వరకు చూసినా అంతుపట్టదు. కామెడీతో సినిమా మొదలవుతుంది. లవ్ స్టోరీగా మారుతుంది...అక్కడి నుంచి మర్డర్ మిస్టరీ...హారర్ ఇలా తనకు ఏం తోస్తే అది తీసుకుంటూ వెళ్లిపోయినట్లుగా అనిపిస్తుంది .
సోషల్ మీడియా రీల్స్...
కామెడీ విషయంలో ఆడియెన్స్ టేస్ట్ చాలా మారిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్‌లలో బోలెడు కామెడీ ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. అలాంటి ఆడియెన్స్‌కు థియేటర్లకు రప్పించాలంటే రెగ్యులర్‌గా ఆలోచిస్తే సరిపోదు. టాప్ కమెడియన్లను తీసుకొని వారితో ఓ నాలుగైదు పంచ్‌లు వేసి అదే కామెడీ అనుకుంటే కష్టమే. అనుమాన పక్షిలో అదే జరిగింది.
నానా హంగామా
హీరోతో పాటు సినిమాలో ప్రతి పాత్ర కామెడీ పేరుతో నానా హంగామా చేస్తారు. ఒక్కటంటే ఒక్క సీన్ నవ్వించదు. అనుమానాల పేరుతో హీరో చేసే హడావిడి ఓ స్టేజ్ దాటిన తర్వాత చిరాకుగా మారుతుంది. ఫలానా సీన్ బాగుంది అన్నది ఒక్కటి కూడా సినిమాలో కనిపించదు. సినిమా ఎలా తీయకూడదు అనడానికి ఉదాహరణగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. అనుమాన పక్షికి దూరంగా ఉండటం మంచిది అంటూ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సినిమా రిజల్ట్‌ను ముందే ఊహించి డైరెక్టర్ ఆ డైలాగ్ రాసుకున్నాడేమో అనిస్తుంది. అనుమాన పక్షి చూసిన తర్వాత ఈ డైరెక్టర్ డీజే టిల్లు తీశాడా అనే అనుమానం ఆడియెన్స్‌కు వస్తుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Chidambaram | సీఈసీ రాజీనామా చేయాలి: చిదంబరం
- ●Pitru Paksha 2026 | రేపటి నుంచి పితృపక్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..
- ●Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ ...అర్థం ఏమిటో తెలుసా?
- ●CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
- ●Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..

Chidambaram | సీఈసీ రాజీనామా చేయాలి: చిదంబరం

Pitru Paksha 2026 | రేపటి నుంచి పితృపక్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..

Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ ...అర్థం ఏమిటో తెలుసా?

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి





