త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venky Anil Ravipudi Movie | రాయ‌ల‌సీమ‌ బ్యాక్‌డ్రాప్ … కానీ నో వ‌య‌లెన్స్ – వెంకీ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ రివీల్‌

వెంక‌టేష్‌, క‌ళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోంద‌ట‌. ఈ సినిమా జాన‌ర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Jun 21, 2026, 4.37 pm IST

Venky Anil Ravipudi Movie | రాయ‌ల‌సీమ‌ బ్యాక్‌డ్రాప్ … కానీ నో వ‌య‌లెన్స్ –   వెంకీ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ రివీల్‌
Advertisement

Venky Anil Ravipudi Movie |  వెంక‌టేష్‌ (Venkatesh), నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇటీవ‌లే అఫీషియ‌ల్ లాంఛ్ అయ్యింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ జాన‌ర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ క‌న్ఫామ్ చేసింది. ఆదివారం ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరోహీరోయిన్ల‌తో పాటు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాష్ కుమార్ క‌నిపించారు.

క‌త్తి ప‌ట్టిన అనిల్ రావిపూడి

ఈ అనిల్‌ను చూస్తే వ‌ణుకొస్తుంది. ఏదో ఒక‌టి అడుగుతాడు అని వెంక‌టేష్ అన్నాడు. ప‌టాస్ అప్పుడు బాగానే ఉన్నాడు. మీరే గారాబం చేసి పాడు చేశారు అని వెంక‌టేష్‌కు క‌ళ్యాణ్ రామ్ బ‌దులిచ్చారు. అప్పుడే క‌త్తి ప‌ట్టుకొని అనిల్ రావిపూడి వారి ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకొచ్చాడు. ఏంటి ఈ క‌త్తి అని వెంక‌టేష్ అడ‌గ్గా...క‌త్తిలాంటి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాన‌ని...కాన్సెప్ట్ కింగ్ గా ఫ్యాన్స్ నాకు ప్ర‌మోష‌న్ ఇచ్చారు అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఒక్క ఐడియా మీరు ఇవ్వొచ్చుగా వెంక‌టేష్‌ను అనిల్ రావిపూడి అడిగారు. క‌త్తి లాంటి ఐడియా ఇస్తాన‌ని...అనిల్ రావిపూడి వేలిని క‌ట్ చేసి అత‌డికి వీర తిల‌కం దిద్దారు వెంక‌టేష్‌. రావిపూడి ర‌క్తంతో విజ‌య తిల‌కం దిద్దిన వెంక‌టేష్ అని క‌ళ్యాణ్ రామ్ చెప్పారు. అనిల్ రావిపూడి అక్క‌డి నుంచి జారుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా...ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు. నాతో తిల‌కం పెట్టించుకోవా అని క‌ళ్యాణ్ రామ్ కూడా అనిల్ వేలిని క‌ట్ చేశారు. అమ్మాయిలు క‌దా అంటూ వీర‌తిల‌కం దిద్దేది అంటూ కీర్తి సురేష్ (Keerthy Suresh), కృతిశెట్టి కూడా అనిల్ రావిపూడి ర‌క్తాన్ని క‌ళ్ల‌జూశారు.

ర‌క్త‌పాతం...

వీడియో చివ‌ర‌లో రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం అంత ర‌క్త‌పాతం అవ‌స‌ర‌మా...మ‌న‌ది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ అంటూ ఈ వీడియో చివ‌ర‌లో సినిమా జాన‌ర్ గురించి అనిల్ రావిపూడి హిట్ ఇచ్చాడు. వ‌చ్చే సంక్రాంతికి అంద‌రిని థియేట‌ర్ల‌లో క‌లుస్తామంటూ హీరోహీరోయిన్లు క‌లిసి రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. సోమ‌వారం నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, జీ స్టూడియోస్‌తో క‌లిసి సాహు గార‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement