త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Udayabhanu | ఓటీటీలో యాంక‌ర్ ఉద‌య‌భాను క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌కు ఇర‌వై ఐదు మిలియ‌న్ల వ్యూస్

యాంక‌ర్ ఉద‌య‌భాను నిర్మించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ పంచ‌నామా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఇటీవ‌లే జీ5 ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ ఇప్ప‌టివ‌ర‌కు 25 మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. పంచ‌నామాలో ప్రేమిస్తే భ‌ర‌త్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

N

Entertainment | Published On Sep 18, 2026, 8.09 pm IST

Udayabhanu | ఓటీటీలో యాంక‌ర్ ఉద‌య‌భాను క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌కు ఇర‌వై ఐదు మిలియ‌న్ల వ్యూస్
Advertisement

Udayabhanu | యాంక‌ర్ ఉద‌భ‌యాను ప్రొడ్యూస‌ర్‌గా మారి పంచ‌నామా పేరుతో ఓ తెలుగు వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్ ఇటీవ‌లే జీ5 ఓటీటీలో రిలీజైంది. పంచ‌నామా వెబ్‌సిరీస్‌లో ప్రేమిస్తే ఫేమ్ భ‌ర‌త్‌, మేథారెడ్డి, సూర్య శ్రీనివాస్‌, శివాజీరాజా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ట్రెండింగ్‌...

ప్ర‌స్తుతం జీ5 ఓటీటీలో పంచ‌నామా ట్రెండింగ్‌లో ఉంది. వారంలోనే ఈ సిరీస్‌కు ఇర‌వై ఐదు మిలియ‌న్ల డిజిట‌ల్ స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్ వ‌చ్చిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ వీక్ జీ5 ఓటీటీలో రిలీజైన సిరీస్‌లు, సినిమాల్లో పంచ‌నామా హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది.

ఆరు ఎపిసోడ్స్‌తో...

పంచ‌నామా సిరీస్‌కు మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. ఫార్మా కంపెనీలు చేస్తోన్న మోసాల‌తో క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా రూపొందింది. డ‌బ్బు ఆశ చూపి తాము త‌యారు చేస్తోన్న మెడిసిన్స్‌ను సామాన్యుల‌పై ఫార్మా కంపెనీలు ఎలా ప్ర‌యోగిస్తున్నాయి? వీటివ‌ల్ల త‌లెత్తే అన‌ర్థాలేమిట‌నే అంశాల‌తో థ్రిల్లింగ్‌గా ద‌ర్శ‌కుడు ఈ సిరీస్ తెర‌కెక్కించారు.

సీరియ‌ల్ కిల్ల‌ర్‌...

ఆది అనే యువ‌కుడు హాస్ట‌ల్ గ‌దిలో హ‌త్య‌కు గుర‌వుతాడు. సాధార‌ణ మ‌ర‌ణంగానే భావించి పోలీసులు కేస్ క్లోజ్ చేస్తారు. ఆది అన్న‌య్య జై (భ‌ర‌త్‌) పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే సీఐగా ప‌నిచేస్తాడు. జై ఎంక్వైరీలో ఆదితో పాటు మ‌రో ముగ్గురిని ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ చంపాడ‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. ఈ హ‌త్య‌లు చేసింది ఎవ‌రు? కిల్ల‌ర్‌ను జై ప‌ట్టుకున్నాడా? జై సోద‌రి దేవ‌కి ఎలా చ‌నిపోయింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఈ సిరీస్‌లో చరణ్ బాబు, రూపా లక్ష్మీ, రాధిక ప్రీతి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

Advertisement
Advertisement