Anchor Ravi | హీరోగా మారిన యాంకర్ రవి – కులాల గొడవలపై కొత్త మూవీ
యాంకర్ రవి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్యాస్ట్ పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో యాంకర్ రవితో పాటు వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్ కథానాయకులుగా కనిపించబోతున్నారు.
Entertainment | Published On Apr 16, 2026, 6.29 pm IST
Anchor Ravi | యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు రవి. పటాస్‌తో పాటు పలు తెలుగు టీవీ షోస్‌కుహోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ టీవీ షోస్ కారణంగా అతడి ఇంటిపేరే యాంకర్ రవిగా మారిపోయింది. తాజాగా యాంకర్ రవి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్యాస్ట్ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో యాంకర్ రవితో పాటు వరుణ్ సందేశ్, సత్యం రాజేష్, గగన్ మిగిలిన హీరోలుగా కనిపించబోతున్నారు. కశికా కపూర్, దివి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. క్యాస్ట్ సినిమాకు ఏకే జంపన్న దర్శకత్వం వహిస్తున్నారు.
యాక్టర్‌గా...
ఈ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌లో యాంకర్ రవి మాట్లాడుతూ... "యాంకర్ రవిగా మీ అందరికీ తెలుసు. ఎప్పటినుంచో యాక్టర్ రవిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. క్యాస్ట్ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఒక పెద్ద సినిమా చేస్తున్న అనుభవాన్ని ఈ సినిమా ఇచ్చింది. కమర్షియల్‌గా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది" అని అన్నారు.
హ్యాపీ డేస్ తర్వాత...
"నలుగురు హీరోలుగా 2007లో నా కెరీర్‌లో ‘హ్యాపీ డేస్’ వచ్చింది. ఆ సినిమా రిలీజై 17 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు మళ్లీ నలుగురి హీరోలులతో క్యాస్ట్ వస్తోంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశా. యాంకర్ రవి ఈ సినిమాతో యాక్టర్ రవిగా తన లైఫ్‌లో కొత్త ఛాప్టర్ మొదలుపెట్టబోతున్నాడు" అని వరుణ్ సందేశ్ అన్నాడు.
కులాన్ని బట్టే...
"మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించే రోజుల్లో అంత బాగుండేది. కానీ మనిషి పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించడం మొదలైనప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. కులం అనేది మనిషికి మనిషికి మధ్య ఒక అడ్డు గోడగా మారిందనే పాయింట్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాలో చూపించబోతున్నాం. కులం గురించి మాట్లాడటానికి చాలామంది వెనుకాడుతారు, కానీ ఇది జీవితంలో ఎంత ముఖ్యమో సందేశాత్మకంగా ఈసినిమాలో చూపించాం" అని దర్శకుడు అన్నారు. క్యాస్ట్ మూవీ షూటింగ్ 90 శాతం వరకు పూర్తయ్యిందని, జూన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



