Anasuya | ఏడాది గ్యాప్ తర్వాత కొత్త సినిమా సైన్ చేసిన అనసూయ.. సూపర్ హిట్ సీక్వెల్‌లో…
అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత సినిమాలకు ఏడాదిపైనే గ్యాప్ ఇచ్చింది అనసూయ. తాజాగా ఈ యాంకర్ ఓ సీక్వెల్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
Entertainment | Published On Jun 27, 2026, 5.57 pm IST
Anasuya | అడివి శేష్ హీరోగా నటించిన క్షణం మూవీ అనసూయ (Anasuya) కెరీర్‌ను మలుపుతిప్పింది. నటిగా ఆమెలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ థ్రిల్లర్ మూవీలో విలన్‌గా కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. క్షణం నుంచే యాక్టర్‌గా అనసూయ బిజీ అయ్యింది. డిఫరెంట్ రోల్స్ ఆమెను వరించడం మొదలుపెట్టాయి.
పదేళ్ల గ్యాప్...
క్షణం తర్వాత పదేళ్ల గ్యాప్ అనంతరం మరోసారి అడివిశేష్ సినిమాలో అనసూయ నటించబోతుంది. అడివిశేష్ హీరోగా నటించిన గూఢచారి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ పెద్ద విజయాన్ని అందుకుంది.
బాలీవుడ్ నటుడు...
గూఢచారి సినిమాకు సీక్వెల్ రాబోతుంది. గూఢచారి 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. వామికా గబ్బి, మధుశాలిని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ ఏడాదే గూఢచారి 2 రిలీజ్ కావాల్సింది. కానీ డెకాయిట్ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ ఎఫెక్ట్ ఈ సీక్వెల్‌పై పడింది.డెకాయిట్ రిలీజ్ తర్వాత కొద్ది నెలలు బ్రేక్ తీసుకున్న అడివిశేష్ తిరిగి గూఢచారి 2 షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. జూలై నుంచి నాన్‌స్టాప్‌గా ఈ సీక్వెల్ షూటింగ్ జరుగబోతుందట.
గోవాలో డిస్కషన్స్...
గూఢచారి 2 సినిమా స్క్రిప్ట్ డిస్కషన్స్ ఇటీవలే గోవాలో జరిగాయి. ఈ డిస్కషన్స్‌లో యాంకర్ అనసూయ కూడా పాల్గొన్నది. ఈ ఫొటోలను అడివిశేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తుఫాను ముందు ప్రశాంతత అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు.
గూఢచారి 2లో అనసూయ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్షణం తరహాలోనే నెగెటివ్ షేడ్స్‌తో పవర్‌ఫుల్‌గా ఈ తెలుగు యాంకర్ రోల్ ఉండబోతున్నట్లు సమాచారం. అనసూయ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే అడివిశేష్ ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు చెబుతోన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది అనసూయ. చాలానే కథలు వింటుందట. కానీ మనసుకు నచ్చిన క్యారెక్టర్లు దొరక్కపోవడంతో వాటిని రిజెక్ట్ చేస్తోందట. దాదాపు ఏడాది తర్వాత గూఢచారి 2 సినిమాను అనసూయ అంగీకరించడం ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలోనే గూఢచారి 2 షూటింగ్ విశేషాలతో పాటు అనసూయ రోల్‌పై క్లారిటీ రానుందట.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aanasuya | జిమ్ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసిన అనసూయ – కామెడీ పీస్ అంటూ నెటిజన్ల విమర్శలు
ఆగస్టు 31, 2026

Veta Movie | చిరంజీవి టైటిల్‌తో కమిటీ కుర్రాళ్లు హీరో మూవీ – నాగబాబు గెస్ట్‌గా లాంఛ్
ఆగస్టు 31, 2026

Rashmika Mandanna | రష్మిక ఈజ్ బ్యాక్ – గాయం తర్వాత ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు – భర్తతో కలిసి షూటింగ్
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్
- ●Harish Rao | రేవంత్ రెడ్డీ.. 'నంది ఎవరో.. పంది ఎవరో..' నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది
- ●Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?
- ●Bharat Gaurav Award | మాజీ డీజీపీ అంజనీ కుమార్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- ●SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు.. 2023 కి.మీ. మేర విస్తరణ
- ●OTT | 5 కోట్ల బడ్జెట్ - 130 కోట్ల కలెక్షన్స్ - విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ... ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్

Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్

Harish Rao | రేవంత్ రెడ్డీ.. 'నంది ఎవరో.. పంది ఎవరో..' నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది

Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?

Bharat Gaurav Award | మాజీ డీజీపీ అంజనీ కుమార్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు



