త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anasuya | హీరోయిన్ అంటే అర్థ‌మిదే… ట్రోల‌ర్స్‌కు అన‌సూయ కౌంట‌ర్‌

త‌న‌ను హీరోయిన్ కాదంటూ ట్రోల్ చేస్తున్న వారికి సోష‌ల్ మీడియా ద్వారా అన‌సూయ‌ కౌంట‌ర్ ఇచ్చింది. స‌త్యం మాట్లాడే ధైర్యం, సొంత దారిలో న‌డిచే శ‌క్తి ఉండ‌ట‌మే నిజ‌మైన హీరోయిన్ ల‌క్ష‌ణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

N

Entertainment | Published On Jan 6, 2026, 6.17 pm IST

Anasuya | హీరోయిన్ అంటే అర్థ‌మిదే… ట్రోల‌ర్స్‌కు అన‌సూయ కౌంట‌ర్‌
Advertisement

Anasuya | ప్ర‌తి రోజు ఏదో ఒక వివాదంతో కొన్నాళ్లుగా వార్త‌ల్లో నిలుస్తోంది అన‌సూయ‌. ఇటీవ‌ల హీరోయిన్ల డ్రెస్‌ల‌పై శివాజీ చేసిన వ్యాఖ్య‌ల‌పై అన‌సూయ బ‌దులు ఇచ్చింది. ఈ క్ర‌మంలో అన‌సూయ చేసిన పోస్ట్‌లు, కామెంట్లు వివాదానికి దారితీశాయి. శివాజీ హీరోయిన్ల గురించి మాట్లాడాడు కానీ నీ గురించి కాదంటూ అన‌సూయ‌ను కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్ చేశారు. తాను హీరోయిన్‌నే కొన్ని సినిమాలు చేశానంటూ అన‌సూయ ఈ విమ‌ర్శ‌లపై రియాక్ట్ అయ్యింది. అయినా ఆమెపై ట్రోల్స్ ఆగ‌లేదు. నువ్వు హీరోయిన్ ఏంటి? అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఏ సినిమాలు చేశావో చెప్పాలంటూ ఫ‌న్నీ ట్వీట్స్ పెట్టారు. తాజాగా ట్రోల‌ర్స్‌కు గ‌ట్టిగా ఇచ్చిప‌డేసింది అన‌సూయ‌.

హీరోయిన్ అంటే...

ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పోస్ట్‌లు పెట్టింది. వీటిలో హీరోయిన్ అంటే అర్థం ఏమిటో వివ‌రించింది. హీరోయిన్ తెర‌పై కాదు...స‌త్యం మాట్లాడే ధైర్యం, సొంత దారిలో న‌డిచే శ‌క్తి, స‌రైన దానికి నిల‌బ‌డే గుండె...అదే నిజ‌మైన హీరోయిన్‌. మిగ‌తావాళ్లు కేవ‌లం న‌టులు మాత్ర‌మే అంటూ అన‌సూయ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హీరోయిన్ అంటే స‌రైన అర్థం ఏమిటో వివ‌రిస్తూ కొన్ని స్క్రీన్ షాట్‌ల‌ను పోస్ట్ చేసింది. అంద‌రూ చేస్తున్నారు క‌దా అని త‌ప్పు ఎప్పుడు ఒప్పు అయిపోదు అంటూ అన‌సూయ పేర్కొన్న‌ది. అన‌సూయ పోస్ట్‌లు వైర‌ల్ అవుతోన్నాయి.

రాశికి క్ష‌మాప‌ణ‌లు...

సోమ‌వారం హీరోయిన్ రాశికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది అన‌సూయ. జ‌బ‌ర్ధ‌స్థ్‌లో చేసిన ఓ స్కిట్‌లో రాశిగారి ఫ‌లాలు అంటూ అన‌సూయ చేసిన ఓ స్కిట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ స్కిట్‌పై రాశి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌న‌ను బాడీ షేమింగ్ చేసే హ‌క్కు అన‌సూయ‌కు లేదంటూ రాశి అన్న‌ది. దాంతో రాశికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ షో ద‌ర్శ‌క‌నిర్మాత‌లే త‌న‌తో డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించార‌ని, అలా మాట్లాడ‌టం పొర‌పాటేన‌ని బ‌దులిచ్చింది. త‌న త‌ప్పును అంగీక‌రిస్తూ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నానంటూ ట్వీట్ చేసింది.
మ‌రోవైపు అన‌సూయ సినిమాల్లో క‌నిపించి చాలా రోజులే అవుతోంది. గ‌త ఏడాది హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటు ఆరి సినిమాలు చేసింది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement