త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anasuya | పెద్ది వివాదంపై అన‌సూయ రియాక్ష‌న్ – బాధ్య‌త‌గా ఉండాలంటూ డైరెక్ట‌ర్‌కు కౌంట‌ర్‌

పెద్ది వివాదంపై యాంక‌ర్ అన‌సూయ రియాక్ట్ అయ్యింది. సినిమాల రూప‌క‌ల్ప‌న‌లో ద‌ర్శ‌కుడికి క్రియేటివ్ ఫ్రీడ‌మ్‌తో పాటు సామాజిక స్పృహ కూడా ఉండాల‌ని అన్న‌ది. నేటి ద‌ర్శ‌కులు చెడును గొప్ప‌గా గ్లోరిఫై చేసి చూపిస్తున్నార‌ని అన‌సూయ త‌న పోస్ట్‌లో పేర్కొన్న‌ది. ద‌ర్శ‌కులు బాధ్య‌తాయుతంగా ప్ర‌వ‌ర్తించాల‌ని అన‌సూయ చెప్పింది.

N

Entertainment | Published On Jun 6, 2026, 3.04 pm IST

Anasuya | పెద్ది వివాదంపై అన‌సూయ రియాక్ష‌న్ – బాధ్య‌త‌గా ఉండాలంటూ డైరెక్ట‌ర్‌కు కౌంట‌ర్‌
Advertisement

Anasuya |  పెద్ది వివాదం టాలీవుడ్‌లో దుమారాన్ని రేపుతోంది. జాన్వీక‌పూర్ పాత్ర‌ను అభ్యంత‌ర‌క‌రంగా చూపించ‌డంపై నెటిజ‌న్ల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాతో పాటు మేక‌ర్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై యాంక‌ర్‌, సినీ న‌టి అన‌సూయ రియాక్ట్ అయ్యింది. పెద్దితో పాటు బుచ్చిబాబు సానా పేరు లేకుండా ఇన్‌డైరెక్ట్‌గా మేక‌ర్స్‌కు సోషల్ మీడియా ద్వారా కౌంట‌ర్ ఇచ్చింది.

చెడును గొప్ప‌గా...

ఒక‌ప్పుడు సినిమాల క‌థ‌లు నైతిక విలువ‌ల‌తో అద్భుతంగా ఉండేవి. హీరోల పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కులు ఉన్నతంగా  చూపించేవారు. కానీ నేడు హీరోలును గొప్ప‌గా చూపించే ప్ర‌య‌త్నంలో ద‌ర్శ‌కులు త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు. సమాజంలోని చెడును సినిమాలో ఆవిష్క‌రించ‌డం వ‌ర‌కే ప‌రిమితం కాకుండా దానిని గొప్ప‌గా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు.

బాధ్య‌తాయుతంగా...

సినిమాల రూప‌క‌ల్ప‌న‌లో ద‌ర్శ‌కుల‌కు క్రియేటివ్ ఫ్రీడ‌మ్ ఎంత ముఖ్య‌మో సామాజిక స్పృహ కూడా అంతే ముఖ్యం. ఒక కథను తెరకెక్కించేటప్పుడు దర్శకుడు, నిర్మాత, నటుడితో పాటు సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా దాని ప్రభావంపై అవగాహన ఉండాలి. స‌మాజాన్ని సంస్కరించేలా , నైతిక విలువ‌ల‌ను నేర్పించేలా సినిమాలు ఉండాల‌ని ఆశించడం త‌ప్పే. కానీ సినిమాకు చాలా ప‌వ‌ర్ ఉంది. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను మార్చ‌గ‌ల‌గ‌డ‌మే కాకుండా స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల‌దు. దానిని దృష్టిలో పెట్టుకొనే ద‌ర్శ‌కులు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి.

టీవీ షో నుంచి...

సృజ‌నాత్మ‌క‌ప‌ర‌మైన విభేదాల వ‌ల్ల గ‌తంలో ఓ టీవీ షో నుంచి నేను బ‌య‌ట‌కు వ‌చ్చాను. ప్ర‌తిభ ఉండి కూడా అవ‌కాశాల విష‌యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. అయినా నేను న‌మ్మిన సిద్ధాంతాల కోసం పోరాడ‌టంలో ఎప్పుడూ వెనుక‌డుగు వేయ‌లేదు. స‌మాజంలో జ‌రిగే ప్ర‌తి త‌ప్పుకు సినిమాను నిందించ‌డం క‌రెక్ట్ కాదు. అలాగ‌ని సినిమాల్లోని చెడును ప్ర‌శ్నించ‌డం, పాత్ర‌ల‌ను అభ్యంత‌రక‌రంగా తీర్చిదిద్దిన తీరుపై విమ‌ర్శలు చేయ‌డం మంచిదే. త‌ప్పుల‌ను ప్ర‌శ్నించ‌డం నా దృష్టిలో క్రియేటివ్ ఫ్రీడ‌మ్‌పై దాడి ఎంత మాత్రం కాదు అంటూ అన‌సూయ పోస్ట్ పెట్టింది. అన‌సూయ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పెద్దితో పాటు బుచ్చిబాబు సానాను ఉద్దేశించే అన‌సూయ ఈ పోస్ట్ పెట్టింద‌ని అంటున్నారు.

 

Advertisement
Advertisement