Anasuya | ఒక్క రోజు సెలబ్రేట్ చేసుకోవడం కాదు – ఉమెన్స్ డే రోజు అనసూయ పోస్ట్
ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అనసూయ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఉమెన్స్ డే వేడులకలపై తనకు పెద్దగా నమ్మకం లేదని అన్నది. ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి రోజు మహిళలదేనని చెప్పింది.
Entertainment | Published On Mar 8, 2026, 3.55 pm IST
Anasuya | గత కొద్ది రోజులుగా సినిమాల కంటే సోషల్ మీడియాలో తనకు ఎదురవుతోన్న ట్రోల్స్, విమర్శలపైనే ఎక్కువగా పోస్ట్‌లు పెడుతోంది అనసూయ. ఆమె ఏ పోస్ట్ చేసినా, ఏం మాట్లాడిన వివాదమే అన్న రీతిలో మారిపోయింది. తాజాగా ఉమెన్స్ డేను పురస్కరించుకొని అనసూయ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఉమెన్స్ డే వేడుకలపై తనకు నమ్మకం లేదని అనసూయ అన్నది. ఈ ఒక్క రోజు మాత్రమే కాదు...ప్రతి రోజు మహిళలదేనని అనసూయ చెప్పింది.
ఒక్క రోజు సరిపోదు...
"మార్చి 8న ఉమెన్స్ డే రోజు ఏం చేస్తున్నారు అని తెలిసిన వాళ్లు అందరూ అడుగుతున్నారు. కానీ నాకు ఇలాంటి వేడుకలపై పెద్దగా నమ్మకం లేదు. ప్రతి రోజు మహిళలు తమ శక్తిని, ధైర్యాన్ని చాటుతూనే ఉంటారు. మహిళంతా స్ట్రాంగ్‌గా ఉండాలి, వారి గౌరవించాలని అని ఈ ఒక్క రోజు చెబితే సరిపోదు. మహిళలు స్ట్రాంగ్ తయారవ్వాలంటే వారి గొంతును నొక్కేయకుండా ఉండటం ముఖ్యం. వారు చెప్పింది వినాలి. ముఖ్యంగా మహిళలను గౌరవిస్తూ, వారిని సపోర్ట్ చేస్తూ, కలిసి ఎదగడం నేర్చుకోవాలి. అలాంటి పురుషులు ప్రతి రోజు మహిళల జీవితాల్లో ఉండాలి" అంటూ అనసూయ ఈ వీడియోలో పేర్కొన్నది. ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.
వివాదం హాట్ టాపిక్...
ఇటీవల హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ చేసిన కామెంట్లపై అనసూయ ఫైర్ అయ్యింది. అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మీరు చెబితే వినే స్టేజ్‌లో లేమంటూ కామెంట్లు పెట్టింది. ఈ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.మరోవైపు సినిమాల పరంగా అనసూయ గ్యాప్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది రిలీజైన హరిహరవీరమల్లు తర్వాత అనసూయ నటించిన సినిమా ఏది రిలీజ్ కాలేదు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



