Anasuya Bharadwaj | నేను కారణజన్మురాలిని – శివాజీ కామెంట్లపై మరోసారి రియాక్ట్ అయిన అనసూయ
శివాజీ కామెంట్లపై అనసూయ మరోసారి రియాక్ట్ అయ్యింది. సినిమాల్లోని పాత్రల ప్రభావం రియల్‌లైఫ్‌లో ఉండటం వల్లే శివాజీ అలా మాట్లాడారని అనసూయ అన్నది. తాను కారణజన్మురాలిని అంటూ చెప్పింది.
Entertainment | Published On Jan 8, 2026, 3.49 pm IST
Anasuya Bharadwaj | శివాజీతో చెలరేగిన వివాదంపై అనసూయ మరోసారి రియాక్ట్ అయ్యింది. గురువారం సోషల్ మీడియాలో ద్వారా అభిమానులతో అనసూయ ముచ్చటించింది. ఈ సందర్భంగా శివాజీ కామెంట్లతో పాటు తనపై వస్తోన్న ట్రోల్స్, విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఒకటి మాట్లాడితే వాటిని చాలా మంది తప్పుగా క్రియేట్ చేస్తున్నారంటూ అన్నది. తనను తాను కారణజన్మురాలిగా భావించుకుంటున్నట్లు తెలిపింది.
గొడవ చేయడానికి
శివాజీ కామెంట్లపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ రియాక్ట్ అవుతూ... "శివాజీగారు ఎంతో కష్టపడి మంచి పాత్రలు చేసి అందరూ ఆయన మాటలు వినే స్థాయికి వచ్చారు. కానీ ఆయన చేసిన పాత్రల ప్రభావం సినిమాల వరకే ఉంటే బాగుంటుంది. నిజం జీవితంలో వాటి ఇంపాక్ట్ ఉండొద్దు. అమ్మాయిలను వారిని నచ్చినట్లు ఉండనీయండి. కొందరు వెధవల నుంచి అమ్మాయిలను కాపాడుకోవడానికి మనందరం వారికి అండగా ఉందాం" అంటూ శివాజీ చెప్పాల్సిందని అనసూయ అన్నది. అలా మాట్లాడటం తప్పు అని చెప్పడానికే శివాజీ కామెంట్లపై తాను రియాక్ట్ అయ్యానని, గొడవ చేయడానికి కాదని అనసూయ తెలిపింది.
నేను కారణజన్మురాలిని...
ఇలాంటి అనవరసపు వివాదాల కోసం మీ శ్రమను ఎందుకు వేస్ట్ చేసుకుంటారని అడిగిన ప్రశ్నకు అనసూయ బదులిస్తూ..."ఇలాంటి వ్యవహారాల్లోకి లాగినప్పుడు నన్ను నేను ఇలాగే ప్రశ్నించుకుంటాను. అలాంటప్పుడే నన్ను నేను కారణజన్మురాలిని అనుకుంటా. విషయం ఏదైనా నా అభిప్రాయం తప్పకుండా చెబుతుంటా. వీటి వల్ల నా పరువు పోయింది అని అందరూ అనుకుంటున్నారు. నా పరువు నా దగ్గరే భద్రంగా ఉంది. అయినా నేనుప్పుడు వివాదాల్లోకి రాలేదు. నా అభిప్రాయాలను మాత్రమే చెబుతున్నాను" అని తెలిపింది. ఈ వివాదాలకు తన భర్త పిల్లలను దూరంగా ఉంచుతానని చెప్పింది. తాను ఫెమిసిన్ట్‌నే కానీ మగవారికి వ్యతిరేకం కాదంటూ తెలిపింది. అనసూయ కామెంట్లపై నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా అటెన్షన్ కోసమే అనసూయ ఈ వివాదాన్ని పెద్దది చేస్తుందని అంటున్నారు.
సంబంధిత వార్తలు

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026

Rahul Ramakrishna | భ్రమల నుంచి బయటకు రాకపోతే …ఖాళీ థియేటర్లే గతి – రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
మే 12, 2026

Dimple Hayathi | మందారం…బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ …భోగి నుంచి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ అదిరిందిగా!
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



