త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anasuya Bharadwaj | గెట‌ప్ మార్చేసిన యాంక‌ర్ అన‌సూయ – బ‌ర్త్ డే రోజు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌

ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌తో అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసేందుకు అన‌సూయ రెడీ అయ్యింది. విరాట్ క‌ర్ణ హీరోగా దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో నాగ‌బంధం పేరుతో తెలుగులో ఓ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. అన‌సూయ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నాగ‌బంధం నుంచి ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On May 15, 2026, 2.51 pm IST

Anasuya Bharadwaj |  గెట‌ప్ మార్చేసిన యాంక‌ర్ అన‌సూయ – బ‌ర్త్ డే రోజు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌
Advertisement

Anasuya Bharadwaj |  బ‌ర్త్‌డే రోజు అభిమానుల‌కు గుడ్‌న్యూస్ వినిపించింది యాంక‌ర్ అన‌సూయ‌. ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోస్ట‌ర్‌తో స‌ర్‌ప్రైజ్ చేసింది. నాగ‌బంధం పేరుతో తెలుగులో ఓ మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. విరాట్ క‌ర్ణ, న‌భాన‌టేష్‌, ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోహీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్న ఈ మూవీలో అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌...

అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ జూలై 3న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అన‌సూయ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుక్ర‌వారం ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో అన‌సూయ క‌నిపిస్తోంది. ముక్కుపుడ‌క ధ‌రించి నుదుట‌న తిల‌కం, మెడ‌లో గిరిజన  ఆభ‌ర‌ణాల‌తో అన‌సూయ గెట‌ప్ ఆక‌ట్టుకుంటోంది. ఆమె చుట్టూ పాములు ప‌డ‌గ విప్పి క‌నిపిస్తోన్నాయి. ఇందులో లీలావతి అనే  నాగ‌జాతికి చెందిన మ‌హిళ‌గా అన‌సూయ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నెగెటివ్ షేడ్స్‌తో ఈ ముద్దుగుమ్మ క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ట‌.

ఏడాది గ్యాప్ త‌ర్వాత‌...

2025లో రిలీజైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు త‌ర్వాత ఏడాది విరామం అనంత‌రం నాగ‌బంధంతో అన‌సూయ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు త‌ర్వాత చాలానే ఆఫ‌ర్లు వ‌చ్చినా క‌థ‌లు న‌చ్చ‌క వాటిని అన‌సూయ వ‌దులుకుంద‌ట‌. నాగ‌బంధం న‌టిగా ఆమెను కొత్త కోణంలో ఆవిష్క‌రిస్తుంద‌ని అంటున్నారు.

వంద కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో నాగ‌బంధం మూవీ తెర‌కెక్కుతోంది. అనంత ప‌ద్మ‌నాభ‌స్వామితో పాటు పూరి జ‌గ‌న్నాథ్ దేవాల‌యంలోని వంద‌ల కోట్ల విలువైన నిధుల‌కు నాగ‌బంధం కాప‌లాగా ఉంటుంది. ఆ నాగ‌బంధాన్ని ఛేదించి టెంపుల్‌లోని సంప‌ద‌ను దోచుకోవాల‌ని అనుకున్న కొన్ని దుష్ట‌శ‌క్తుల‌ను ఓ యువ‌కుడు ఎలా ఎదుర్కొన్నాడ‌నే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. నాగ‌బంధంలో జ‌గ‌ప‌తిబాబు, రిష‌బ్ స‌హానీ, ముర‌ళీ శ‌ర్మ‌  కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement