Anasuya Bharadwaj | డబుల్ మీనింగ్ మాట్లాడటం పొరపాటే – తప్పును అంగీకరిస్తున్నా – రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ
సీనియర్ హీరోయిన్ రాశికి అనసూయ క్షమాపణలు చెప్పింది. మూడేళ్ల క్రితం తెలుగు రాని తనంపై చేసిన స్కిట్‌లో డబుల్ మీనింగ్ మాట్లాడి పొరపాటు చేశానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది అనసూయ. తనను అవమానించడానికే కొందరు అప్పటి మాటలను ఇప్పడు వైరల్ చేస్తున్నారని అనసూయ అన్నది.
Entertainment | Published On Jan 5, 2026, 5.21 pm IST
Anasuya Bharadwaj | జబర్ధస్థ్ షోలో సీనియర్ హీరో రాశిపై చేసిన కామెంట్లకుగాను అనసూయ క్షమాపణలు చెప్పింది. సోమవారం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. అప్పట్లో షో నిర్వహకులు తనతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించారని ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. తన బాధ్యతగా తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెబుతున్నానంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. జబర్ధస్థ్ యాంకర్‌గా కొనసాగుతోన్న టైమ్‌లో అనసూయ హైపర్ ఆదితో కలిసి ఓ స్కిట్ చేసింది. ఈ స్కిట్‌లో రాశి గారి ఫలాలు అంటూ అనసూయ కామెంట్స్ చేసింది. గత కొద్ది రోజులుగా అనసూయ పాత స్కిట్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రాశి రియాక్ట్ అయ్యింది. తనను బాడీ షేమింగ్ చేసే హక్కు ఆమెకు (అనసూయ)ఎవరిచ్చారంటూ అనసూయపై ఫైర్ అయ్యింది. మహిళ అయ్యిండి మరో సాటి మహిళపై అలాంటి కామెంట్లు చేయడం దారుణం అంటూ రాశి ఆవేదనను వ్యక్తం చేసింది . రాశి వీడియో వైరల్ కావడంతో అనసూయ దిగొచ్చింది. ఆమెకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
సరిదిద్దలేను...
"మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికీ నాకు ఉన్నటువంటి శక్తి సరిపోలేదు. అది నా పొరపాటే. అందుకు క్షమాపణలు చెబుతున్నా. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. ఆ షోలో ద్వందార్థపు మాటలను ఖండించడం దగ్గర నుంచి ఆ షోను విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పును మీరు గమనించవచ్చు.ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్నందే నాకు వ్యతిరేకంగా అప్పటి మాటలు తీసి నాపై విద్వేషాన్ని కలిగించేలా కొందరు క్యాంపెయిన్ చేస్తున్నారు. నన్ను అవమానించడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బంది కరంగా ఉన్నాయో నేను ఊహించగలను. ఈ షో దర్శకనిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పును అంగీకరిస్తూ మీకు క్షమాపణల చెబుతున్నా. నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా" అంటూ ఈ ట్వీట్ లో అనసూయ పేర్కొన్నది. అనసూయ ట్వీట్ వైరల్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Trisha | సూర్య, త్రిష మధ్య విభేదాలు? – చెన్నై క్వీన్‌ను అవమానించారంటూ ఫ్యాన్స్ ఫైర్
మే 18, 2026

Jacqueline Fernandez | మనీ లాండరింగ్ కేసులో ట్విస్ట్ – బాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురుదెబ్బ
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



