త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anasuya | బాడీ షేమింగ్ చేసే హక్కు లేదు – అన‌సూయ‌, రోజాల‌కు సీనియ‌ర్ హీరో రాశి కౌంట‌ర్‌

యాంక‌ర్ అన‌సూయ‌తో పాటు మాజీ మంత్రి రోజాపై సీనియ‌ర్ హీరోయిన్ రాశి ఫైర్ అయ్యింది. గ‌తంలో చేసిన ఓ స్కిట్‌లో రాశి గారి ఫ‌లాలు అంటూ త‌న‌ను బాడీ షేమింగ్ చేశార‌ని చేశార‌ని అన్న‌ది. వారిపై లీగ‌ల్‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనుకున్నానంటూ చెప్పింది.

a

Entertainment | Published On Jan 5, 2026, 2.17 pm IST

Anasuya | బాడీ షేమింగ్ చేసే హక్కు లేదు – అన‌సూయ‌, రోజాల‌కు సీనియ‌ర్ హీరో రాశి కౌంట‌ర్‌
Advertisement

Anasuya | ఇటీవ‌ల జ‌రిగిన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌ల‌పై శివాజీ చేసిన కామెంట్లు టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. శివాజీ కామెంట్ల‌ను అన‌సూయ‌, చిన్మ‌యితో పాటు ప‌లువురు సెలిబ్రిటీలు త‌ప్పుప‌ట్టారు. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు మాత్రం శివాజీ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించారు. బూతులు మాట్ల‌డ‌టం త‌ప్పే కానీ హీరోయిన్ల డ్రెస్‌లో విష‌యంలో అత‌డు చేసిన కామెంట్లు మాత్రం స‌రైన‌వేన‌ని కామెంట్లు పెడుతున్నారు.

బాడీ షేమింగ్ కామెంట్లు...

తాజాగా శివాజీ కామెంట్ల‌పై సీనియ‌ర్ హీరోయిన్ రాశి త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా రియాక్ట్ అయ్యింది. శివాజీని స‌పోర్ట్ చేసిన రాశి...యాంక‌ర్ అన‌సూయ‌తో పాటు మాజీ మంత్రి రోజాపై విరుచుకుప‌డ్డారు. గ‌తంలో అన‌సూయ త‌న‌ను బాడీ షేమింగ్ కామెంట్లు చేసింద‌ని , ఆమెపై లీగ‌ల్‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాన‌ని రాశి అన్న‌ది. జ‌బ‌ర్ధ‌స్థ్‌కు యాంక‌ర్‌గా ప‌నిచేస్తున్న రోజుల్లో హైప‌ర్ ఆదితో క‌లిసి అన‌సూయ ఓ స్కిట్ చేసింది. ఇందులో రాశి గారి ఫ‌లాలు అంటూ అన‌సూయ ఓ పంచ్ వేసింది. అన‌సూయ జోక్‌కు రోజా న‌వ్వింది. ఈ స్కిట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వైర‌ల్ స్కిట్‌పై త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా రాశి రియాక్ట్ అయ్యింది. "స‌ద‌రు స్కిట్‌లో కంటెస్టెంట్ రాశి ఫ‌లాలు అని అంటే రాశి గారి ఫ‌లాల గురించి మాట్లాడుతున్నావా అంటూ ఆ యాంక‌ర్ వ్య‌గంగా మాట్లాడింది. ఓ మ‌హిళ అయి ఉండి అలా ఎలా మాట్లాడుతుంది" అని రాశి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
"రాశి ఫ‌లాలు అని మాట్లాడితే నేను ప‌ట్టించుకునేదానికి కాదు. రాశి గారి ఫ‌లాలు అంటూ కావాల‌నే అన్న‌ది. ఆ యాంక‌ర్ మాట‌ల‌కు జ‌డ్జి కూడా న‌వ్వారు. బాడీ షేమింగ్ చేసే హ‌క్కు వారికి ఎవ‌రిచ్చారు. వారిపై లీగ‌ల్‌గా యాక్ష‌న్ తీసుకోవాల‌ని అనుకున్నా. కానీ కుటుంబ‌స‌భ్యులు వారించ‌డంలో ఆగిపోయా" అని రాశి అన్న‌ది.
అప్పుడు నాపై కామెంట్లు చేసిన వాళ్లే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారంటూ అన‌సూయ‌కు రాశి కౌంటర్ ఇచ్చింది.  ఈ వీడియోలో శివాజీ మాటాల‌పై కూడా రాశి రియాక్ట్ అయ్యింది. శివాజీ మాట్లాడిన మాట‌ల్లో రెండు మూడు త‌ప్పుడు మాట‌లు దొర్లాయి. వాటిపై ఆయ‌న సారీ కూడా చెప్పారు. శివాజీ మాట్లాడిన మాట‌ల‌ను వంద శాతం త‌ప్పు అని చెప్ప‌లేను అంటూ రాశి కామెంట్స్ చేశారు. యూట్యూబ్‌లో ఆమె చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement