Anarkali Nazar | మలయాళ బ్యూటీతో గోపీచంద్ రొమాన్స్ – ఎవరీ అనార్కలి నాజర్?
గోపీచంద్ హీరోగా ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనార్కలి నాజర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On May 3, 2026, 3.55 pm IST
Anarkali Nazar |టాలీవుడ్‌లోకి మరో మలయాళ బ్యూటీ అడుగుపెట్టబోతుంది. సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌తోనే అభిమానుల మనసులను కొల్లగొట్టింది. గోపీచంద్ హీరోగా ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వంలో హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఆదివారం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌లో దిల్‌రాజు, శివ నిర్వాణ, రామ్ లక్ష్మణ్‌తో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న 34వ మూవీ ఇది.
తొలి సినిమా...
ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనార్కలి నాజర్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.గోపీచంద్ మూవీతోనే అనార్కలి తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతోంది. ఓపెనింగ్ ఈవెంట్‌లోనూ అనార్కలి పాల్గొన్నది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
రా అండ్ రస్టిక్...
డైరెక్టర్‌గా ఫైట్ మాస్టర్ వెంకట్ డెబ్యూ మూవీ ఇదే. రా అండ్ రస్టిక్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. 70 ఎమ్ ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
మలయాళంలో....
గోపీచంద్ సినిమా కంటే ముందు మలయాళం, తమిళంలో కొన్ని సినిమాలు చేసింది అనార్కలి నాజర్. కుంచాకో బోబన్ హీరోగా 2021లో వచ్చిన మోహన్ కుమార్ ఫ్యాన్స్ సినిమాతో అనార్కలి యాక్కింగ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత కుంజెల్దో, ఆరాట్టుతో పాటు మరికొన్ని మలయాళ సినిమాలు చేసింది. తమిళంలో బ్లడీ బెగ్గర్‌తో పాటు విజయ్ ఆంటోనీ రోమియోలో హీరోయిన్‌గా నటించింది.కాగా ప్రస్తుతం గోపీచంద్ భరతవర్ష పేరుతో ఓ హిస్టారికల్ మూవీ చేస్తున్నారు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇందులో రీతూ వర్మ కథానాయికగా కనిపించబోతున్నది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



