Akasamlo Oka Tara Review | ఆకాశంలో ఒక తార రివ్యూ – దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?
వైవిధ్యతను, కొత్తదనాన్ని నమ్మి సినిమాలు చేస్తుంటారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆ పంథానే అతడికి టాలీవుడ్‌లోనూ స్టార్‌డమ్, క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. సీతారామం, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తెలుగు మూవీ ఆకాశంలో ఒక తార. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Nov 20, 2026, 11.00 am IST
Akasamlo Oka Tara Review | కలలు కంటే సరిపోదు. వాటిని నిజం చేసుకోవాలనే బలమైన సంకల్పానికి తోడు సరైన మార్గదర్శనం అవసరం. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన ప్రతి ఒక్కరి వెనుక ఎంతో మంది త్యాగాలు, కష్టాలు ఉంటాయి. విజేతలవే కాదు...వారి కోసం త్యాగాలు చేసిన వారి కథలు కూడా గొప్పగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆకాశంలో ఒక తారతో దర్శకుడు చెప్పారు.
కల్పన కల...
కల్పన (సాత్విక వీరవల్లి) సరైన రోడ్డు కూడా లేని ఓ పల్లెటూరు. తండ్రి తాగుబోతు. కూతురిని చదివించాలన్నది తల్లి కల. చిన్నప్పుడే ఆస్ట్రోనాట్ కావాలనే బలమైన కోరిక కల్పనలో మొదలవుతుంది.ఆమె కల గురించి విని అందరూ నవ్వుకుంటారు. కనీసం ఊరి పొలిమేర కూడా దాటలేవని హేళన చేస్తారు. కూతురు చదివితే తన మాట ఎక్కడ వినకుండాపోతుందో అని భయపడిన తండ్రి పదో తరగతి పరీక్షలు పూర్తికాగానే పెళ్లిచేస్తాడు.
కృష్ణ (దుల్కర్ సల్మాన్) ఓ మోకానిక్. అక్కతో పాటు తాను బాగా చదువుకోవాలని అనుకుంటాడు. కానీ పరిస్థితులు అనుకూలించక మెకానిక్‌గా మారతాడు. కల్పనతో కృష్ణకు పెళ్లవుతుంది.
కల్పన చదువు, కల గురించి తెలుసుకున్న కృష్ణ ఆమెకు అండగా నిలవాలని అనుకుంటాడు. ఊరు విడిచిపెట్టి సిటీకి పయనమవుతాడు. తాను కష్టపడుతూ భార్యను చదివిస్తాడు. ప్రతిష్టాత్మక కాలేజీలో కల్పనకు సీట్ వస్తుంది. ఓ వైపు చదువుకుంటూనే ఆస్ట్రోనాట్ కావాలనే తన కోరికకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంటుంది. కాలేజీలో కల్పన చేసిన ఓ రాకెట్ ప్రయోగం విఫలమవుతుంది. అంతరిక్షంపై ఆశలు వదులుకొని ఓ గవర్నమెంట్ జాబ్‌లో చేరుకుంది.
అదే టైమ్‌లో రోహిణి (శృతి హాసన్) రూపంలో కల్పనకు మరో అవకాశం వస్తుంది. శాటిలైట్‌ను ఆకాశంలోకి పంపించాలనే ప్రయత్నంలో ఆస్తి మొత్తం పొగొట్టుకుంటుంది. చివరి అవకాశం మాత్రమే మిగులుతుంది. అదే ఫెయిలైతే జీవితం రోడ్డు మీదకు వస్తుంది. అందులో ఎలాగైనా విజయాన్ని సాధించాలనే కల్పనను వెతుక్కుంటూ వస్తుంది రోహిణి. ఆ తర్వాత ఏమైంది? రోహిణి సాయంతో కల్పన అంతరిక్షంలో అడుగుపెట్టిందా? కల్పన లక్ష్యానికి తాను అడ్డు కాకూడదని కృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? కల్పన కలకు అడుగడుగునా ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే మిగిలిన కథ.
విజేతల కథలతో...
హీరోహీరోయిన్లు కష్టాలను దాటి తమ లక్ష్యాలను సాధిస్తూ విజేతలుగా నిలిచే కథలతో తెలుగు తెరపై చాలానే సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆకాశంలో ఒక తార కథను రాసుకున్నారు దర్శకుడు. కల్పన చావ్లా జీవితం నుంచే స్ఫూర్తి పొంది దర్శకుడు పవన్ సాదినేని ఈ కథను రాసుకున్నారు. కల్పన చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టింది అనగానే అందరూ ఆమె పుట్టింది, పెరిగింది ఎక్కడ.. స్పేస్‌లో ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే అంశాల గురించే ఆలోచిస్తారు. కానీ దర్శకుడు మాత్రం ఆమె గెలుపు వెనుక ఎవరున్నారన్నది చూశారు. వారి కథ చెప్పాలని అనుకున్నాడు.
అట్టడుగు నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఓ అమ్మాయిని కలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఓ మగాడి కథ ఇది. భార్య సంకల్పాన్ని సాకారం చేసేందుకు ఓ భర్త పడే తపన, త్యాగాన్ని హృద్యంగా ఈ సినిమాలో చూపించాడు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాదిరిగా ఇందులో ఆడియెన్స్‌కు హై ఇచ్చే ట్విస్ట్‌లు ఉండవు. ఫైట్లు, రొమాంటిక్ సీన్లు, ఎలివేషన్లు, హీరోయిజాలు భిన్నంగా స్ఫూర్తిదాయకంగా కథను చెప్పాలని అనుకున్నారు. ఆ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.
రెండు కోణాలు...
సినిమాలో రెండు కోణాలు కనిపిస్తాయి. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే లేడీ ఓరియెంటెడ్ మూవీలా అనిపిస్తుంది. తండ్రి తాగుబోతు...పదో తరగతిలోనే పెళ్లి...కష్టపడి ఆస్ట్రోనాట్ అవడం అనే అనే అంశాలను దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. దుల్కర్ పాత్ర కోణం నుంచి ఆలోచిస్తే సగటు హీరో మూవీనే అనే భావన కలుగుతుంది. భార్య కలలో తన గెలుపును చూసుకుని సంబరపడే ఓ భర్త. తానే కాళ్లుగా మారి ఆమె లక్ష్యం వైపు నడిపించడానికి అతడు సాగించే ప్రయాణాన్నిఎమోషనల్‌గా ఆవిష్కరించారు డైరెక్టర్ . రెండింటిని బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. అంతే బలంగా పాత్రలను రాసుకున్నాడు.
నాచురల్‌గా....
పల్లెటూరిలో పుట్టిన అమ్మాయి...ఆస్ట్రోనాట్‌గా ఎలా మారింది అన్నదే ఈ మూవీ కథ. ఎలాగైనా క్లైమాక్స్‌లో తన లక్ష్యాన్ని హీరోయిన్ చేరుకుంటుంది అన్నది ఫస్ట్ సీన్‌లోనే ఆడియెన్స్‌కు అర్థమైపోతుంది. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. కల్పన, కృష్ట పాత్రలకు ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలను చాలా సహజంగా చూపించారు.
ఆ లోటు భర్తీ....
నటన పరంగా దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి పాత్రలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. హీరోలంతా పాన్ ఇండియన్ మోజులో పడి రియలిస్టిక్ కథలు, పాత్రలకు దూరమవుతున్నారు. ఆ లోటును దుల్కర్ తీర్చేస్తున్నాడు. కృష్ణ పాత్రలో అతడు చెప్పే డైలాగ్స్, పలికించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. సాత్వికకు హీరోయిన్‌గా ఇదే తొలి సినిమా. కానీ ఎంతో అనుభవమున్న నటిలా కనిపించింది. పాత్ర కోసం ప్రాణం పెట్టేసింది. స్టాంగ్ రోల్‌లో శృతి హాసన్ కనిపించింది. మోడ్రన్ స్టైల్‌లో ఆ క్యారెక్టర్‌ను రాసుకున్న తీరు బాగుంది. రుహానీ శర్మ, కోట జయరామ్‌తో పాటు మిగిలిన వారు నటన బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ తన మ్యూజిక్‌తో ఈ కథకు మరింత అందం తీసుకొచ్చారు.
మంచి సినిమాలు తెలుగులో రావడం లేదనే ప్రశ్నకు సమాధానంగా నిలిచే మూవీ ఆకాశంలో ఒక తార.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు – హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
నవంబర్ 20, 2026

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్- టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్
నవంబర్ 20, 2026

Nivetha Thomas | నేషనల్ అవార్డ్ సినిమా చేసినా… ఛాన్స్‌లు నిల్ – ఓటీటీలోకి నివేదా థామస్ ఎంట్రీ
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే



