త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ananya Panday | ప్రియుడితో బ్రేక‌ప్ – రెండేళ్ల ప్రేమ బంధానికి లైగ‌ర్ హీరోయిన్ గుడ్‌బై

లైగ‌ర్ హీరోయిన్ అన‌న్యా పాండే ల‌వ్‌స్టోరీకి బ్రేక‌ప్ ప‌డిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త రెండేళ్లుగా అమెరిక‌న్ మోడ‌ల్ వాక‌ర్ బ్లాంకోతో అన‌న్యా పాండే ప్రేమ‌లో ఉంది. వీరిద్ద‌రు పెళ్లిచేసుకోబోత‌న్న‌ట్లు వార్త‌లొచ్చాయి. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి ప్రేమ బంధానికి ఇటీవ‌లే ముగింపు ప‌డిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Aug 27, 2026, 4.16 pm IST

Ananya Panday | ప్రియుడితో బ్రేక‌ప్ – రెండేళ్ల ప్రేమ బంధానికి లైగ‌ర్ హీరోయిన్ గుడ్‌బై
Advertisement

Ananya Panday |  లైగ‌ర్ మూవీ హీరోయిన్ అన‌న్యా పాండే ప్రియుడితో తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు బాలీవుడ్ స‌ర్కిల్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పెళ్లి వ‌ర‌కు చేరుకుంటుంద‌ని అనుకున్న ప్రేమ‌ బంధానికి రెండేళ్ల‌లోనే ముగింపు ప‌డిన‌ట్లు చెబుతున్నారు. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తోనే ప్రియుడికి ఈ బాలీవుడ్ బ్యూటీ బ్రేక‌ప్ చెప్పిన‌ట్లు స‌మాచారం.

అమెరిక‌న్ మోడ‌ల్‌....

అమెరిక‌న్ మోడ‌ల్ వాక‌ర్ బ్లాంకోతో అన‌న్యా పాండే ల‌వ్‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ పెళ్లి వేడుక‌లో వాక‌ర్‌తో అన‌న్యాకు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు స‌మాచారం. ఆంబానీ ఇంట జ‌రిగిన పెళ్లి వేడుక‌తో పాటు ప‌లు ఈవెంట్స్‌లో వీరిద్ద‌రు జంట‌గా క‌నిపించారు. వాక‌ర్‌తో అన‌న్యా పాండే విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన ఫొటోలు నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించాయి.

ఐ ల‌వ్ యూ....

గ‌త ఏడాది అన‌న్యా పాండే బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ కోసం వాక‌ర్ ఇండియాకు వ‌చ్చాడు. ఈ వేడుక‌ల్లో పాల్గొన్నాడు. ఐ ల‌వ్ యూ అనీ అంటూ అత‌డు పెట్టిన ఓ పోస్ట్ వైర‌ల్ అయ్యింది. వాక‌ర్ పేరులోని మొద‌టి ఆక్ష‌రం వీ పేరుతో స్పెష‌ల్‌గా డిజైన్ చేసిన ఓ చైన్ ధ‌రించి చాలా సార్లు అన‌న్యా క‌నిపించింది. వీరిద్ద‌రి ప్రేమాయ‌ణం నిజ‌మేనంటూ బాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు స‌న్నిహితులు చెబుతూ వ‌చ్చారు. త్వ‌ర‌లోనే వాక‌ర్‌తో అన‌న్యా పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

బ్రేక‌ప్‌...

రెండేళ్ల‌కే వీరి ప్రేమ బంధానికి ముగింపు ప‌డిన‌ట్లు స‌మాచారం. అభిప్రాయ‌భేదాల కార‌ణంగా అన‌న్యా, వాక‌ర్‌ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌లైన‌ట్లు తెలిసింది.ల‌వ్‌స్టోరీని కొన‌సాగించ‌డం కంటే విడిపోవ‌డ‌మే మంచిద‌నే ఆలోచ‌న‌తోనే ప్రియుడికి అన‌న్యా బ్రేక‌ప్ చెప్పింద‌ని అంటున్నారు.

లైగ‌ర్‌తో...

ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఐదేళ్లు అయినా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క హిట్టు కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. లైగ‌ర్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఇక్క‌డ కూడా నిరాశే మిగిలింది. ప్ర‌స్తుతం హిందీలో అవ‌కాశాల కోసం వెయిటింగ్‌లో ఉంది.

 

Advertisement
Advertisement