Ananya Nagalla | అనన్య నాగళ్ల హీరోయిన్‌గా బ్రేకింగ్ న్యూస్ – ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మెగాస్టార్
తెలుగులో హీరోయిన్‌గా కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది అనన్య నాగళ్ల. ది బ్రేకింగ్ న్యూస్ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిరంజీవి రిలీజ్ చేశారు.
Entertainment | Published On Apr 17, 2026, 8.29 pm IST
Ananya Nagalla | హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాముఖ్యమున్న పాత్రల్లో కనిపిస్తోంది అనన్య నాగళ్ల. ఈ అచ్చ తెలుగు అందం హీరోయిన్‌గా ది బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఓ సినిమా రాబోతుంది. మురళీ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి....
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. పోస్టర్ ఆసక్తిని పంచుతుందని, మురళీ మోహన్, అనన్య నాగళ్ల పాత్రలు విభిన్నంగా కనిపిస్తున్నాయని చిరంజీవి అన్నారు.
మీడియా బ్యాక్‌డ్రాప్‌లో...
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో న్యూస్ పేపర్ కటింగ్స్ రూపంలో మురళీ మోహన్ లుక్‌ను చూపించారు. అతడి ఫొటో ముందు న్యూస్ ప్రజెంటర్‌గా అనన్య నాగళ్ల కనిపిస్తోంది. మీడియా బ్యాక్‌డ్రాప్‌లో ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా ది బ్రేకింగ్ న్యూస్‌ను తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు ప్రకటించారు. మీడియాలోని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించబోతున్నామని అన్నారు. మే నెలలో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.
రెండేళ్ల తర్వాత...
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోన్న మూవీ ఇది. చివరగా 2024లో శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ సినిమా చేసింది. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీలో అనన్య నాగళ్ల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






