Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
రష్మిక మందన్న ఊరి బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. లీసా పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నవంబర్‌లో థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Sep 4, 2026, 5.12 pm IST
Ananya Nagalla | అచ్చ తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల కొత్త సినిమా షూటింగ్‌ను సైలెంట్‌గా కంప్లీట్ చేసేసింది. రష్మిక మందన్న సొంత ఊరు విరాజ్‌పేట ఈ సినిమాకు లింక్ ఉండబోతున్నట్లు టాక్. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వెరైటీ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తోంది అనన్య నాగళ్ల. తాజాగా లీసా పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు జవహర్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ట్విస్ట్‌లు హైలైట్...
డిఫరెంట్ కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే ఆద్యంతం లీసా మూవీ థ్రిల్లింగ్‌గా సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు. ఇప్పటివరకు తెలుగులో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్‌లో కనిపించిన అనన్య నాగళ్ల ఈ సినిమాలో యాక్షన్ ప్రధానంగా సాగే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె క్యారెక్టర్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్‌లు లీసాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.
విరాజ్‌పేట...
లీసా మూవీ షూటింగ్ మొత్తం కూర్గ్, విరాజ్‌పేటలో జరిపారు. రష్మిక మందన్న సొంత ఊరు విరాజ్‌పేట నేపథ్యంలో ఈ తెలుగు సినిమా కథ సాగుతుందని అంటున్నారు. హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. లీసా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్‌లో థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మల్లేషం...
మల్లేషం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్లే బ్యాక్, అన్వేషి, తంత్రతో పాటు పలు చిన్న సినిమాల్లో కథానాయికగా నటించింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో ఓ కీలక పాత్రలో నటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026

Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష – పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్
సెప్టెంబర్ 3, 2026

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ – రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
- ●Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..
- ●Jagadeesh Reddy | కొండా సుస్మిత వెనక మేముంటే... మరి రాజగోపాల్‌రెడ్డి వెనకెవరున్నరు?
- ●Kayadu Lohar | రాజకీయాలు చేయడం నాకు రాదు - తమిళ సినిమా కాంట్రవర్సీపై కయదు లోహర్ కామెంట్స్
- ●SEBI | డెరివేటివ్స్ సెటిల్మెంట్ ధరలపై సెబీ కీలక సమీక్ష.. వారం రోజుల్లో మార్పులు..?
- ●Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..

Jagadeesh Reddy | కొండా సుస్మిత వెనక మేముంటే... మరి రాజగోపాల్‌రెడ్డి వెనకెవరున్నరు?

Kayadu Lohar | రాజకీయాలు చేయడం నాకు రాదు - తమిళ సినిమా కాంట్రవర్సీపై కయదు లోహర్ కామెంట్స్



