Ananya Nagalla | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వివాదం – డబ్బుల కోసం కాదంటూ అనన్య నాగళ్ల క్లారిటీ
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వివాదంపై హీరోయిన్ అనన్య నాగళ్ల క్లారిటీ ఇచ్చింది. అభిమానులతో టచ్‌లో ఉండాలనే సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్ చేశానని, డబ్బులు సంపాదించడానికి కాదని అన్నది.
Entertainment | Published On Apr 19, 2026, 6.42 pm IST
Ananya Nagalla | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కొందరు యాంకర్లు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇటీవల యాంకర్ విష్ణుప్రియపై కేసు కూడా నమోదు అయ్యింది. సోషల్ మీడియాలో విష్ణుప్రియ అశ్లీల ఫొటోలను పోస్ట్ చేస్తుందంటూ నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు. విష్ణుప్రియ బాటలోనే హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా అడుగులు వేస్తోందని , ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ల పేరుతో గట్టిగానే సంపాదిస్తోందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇచ్చింది.
సొసైటీకి హెల్ప్ చేయాలనే...
తన ఆలోచనలు, అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడానికే సబ్‌స్క్రిప్షన్‌ను మొదలుపెట్టానని, భక్తి కోసమే కానీ డబ్బులు సంపాదించడానికి కాదని అన్నది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది."రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉండాలి...అందరితో కనెక్ట్ అవ్వాలనే సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్ చేశా. నటిగా, మహిళగా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాలు, పరిస్థితులతో పాటు...నా రోజువారి లైఫ్ ఎలా ఉంటుందో తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. అభిమానుల నుంచి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవాలని ఉంది. సొసైటీకి ఏదైనా చిన్న హెల్ప్ చేయాలనే 2025లోనే సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకొచ్చా" అంటూ అనన్య నాగళ్ల చెప్పింది.
షూటింగ్ లతో బిజీ...
భక్తి విషయాలను కూడా షేర్ చేస్తానని అన్నది. "ఇరవై ఒక్క రోజుల పాటు రోజుకు 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని పటిస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని అన్నది. ఇలాంటి మంచి విషయాల కోసమే కానీ డబ్బు సంపాదించుకోవాలని అనుకోవడం లేదు. గత పదిహేను రోజులుగా షూటింగ్‌లతో బిజీగా ఉండి ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వలేకపోయా. ఇకనైనా ఈ రూమర్లు ఆగుతాయని అనుకుంటున్నా" అని అన్నది.
ప్రస్తుతం హీరోయిన్‌గా ది బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఓ సినిమా చేస్తోంది అనన్య నాగళ్ల. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిరంజీవి రిలీజ్ చేశారు. సాయిధరమ్‌తేజ్ సంబరాట ఏటిగట్టు సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




