Vishnupriya | తగ్గేదేలే – ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ రేటుపై విష్ణుప్రియ కామెంట్స్
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వివాదం కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచింది యాంకర్ విష్ణుప్రియ. ఈ వివాదం వల్ల ఆమె సబ్‌స్కైబర్లు రెట్టింపు అయ్యారు. ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ల ద్వారా నెలకు 29 లక్షల వరకు సంపాదిస్తోంది విష్ణుప్రియ. సబ్‌స్క్రిప్షన్ రేట్లను తగ్గించమని ఓ నెటిజన్ విష్ణుప్రియను రిక్వెస్ట్ చేశాడు. అతడికి విష్ణుప్రియ ఏమని బదులిచ్చిందంటే?
Entertainment | Published On Jul 12, 2026, 2.46 pm IST
Vishnupriya | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సబ్‌స్క్రిప్షన్ల పేరుతో అశ్లీల కంటెంట్ షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ లిస్ట్‌లో బిగ్‌బాస్ బ్యూటీ విష్ణుప్రియ భీమినేని కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వివాదానికి సంబంధించి ఏకంగా విష్ణుప్రియపై కేసు కూడా నమోదు అయ్యింది. అవన్నీ ఆమెకు ప్లస్సయ్యాయి తప్పితే మైనస్ కాలేదు. ఈ వివాదం వల్ల ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. అంతే కాదు రేటు విషయంలో తగ్గేదేలే అని అంటోంది.
రేటు తగ్గించింది ప్లీజ్
"సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించండి. నేను మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతాం. మాకు జాబ్స్ కూడా లేవు. ప్లీజ్" అంటూ ఓ నెటిజన్ విష్ణుప్రియను రిక్వెస్ట్ చేశాడు. "డబ్బులను వృథా చేసుకోకుండా చదువుపై దృష్టి పెట్టు" అంటూ సదరు నెటిజన్‌కు విష్ణుప్రియ రిప్లై ఇచ్చేసింది. ఇన్‌డైరెక్ట్‌గా సబ్‌స్క్రిప్షన్ రేటును తగ్గించేదిలేదని చెప్పింది. ఆమె రిప్లై వైరల్ అవుతోంది.
29 లక్షల ఆదాయం...
ప్రస్తుతం విష్ణుప్రియకు ఇన్‌స్టా సబ్‌స్క్రైబర్లు 7400 మంది ఉన్నారు. నెలకు 390 వరకు ఛార్జ్ చేస్తోంది. సబ్‌స్క్రిప్షన్ల ద్వారా ప్రతి నెలా 28 నుంచి 29 లక్షల వరకు సంపాదిస్తోన్నట్లు సమాచారం. తెలుగులో సబ్‌స్క్రిప్షన్ల ద్వారా అత్యధికంగా సంపాదిస్తోన్న సోషల్ మీడియా సెలిబ్రిటీలలో విష్ణుప్రియ ఒకరు.
పోవే పోరా...
యాంకర్‌గా విష్ణుప్రియ పోవే పోరా షోతో విష్ణుప్రియ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత కామెడీ స్టార్స్, ఢీ , హ్యాపీ డేస్‌తో పాటు మరికొన్ని షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. యువర్స్ అభి, వాంటెడ్ పండుతాడు, ది 100, మయూఖంతో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. దయా వెబ్‌సిరీస్‌లో నటించింది. టీవీ షోస్, సినిమాలతో కంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న విష్ణుప్రియ ఫైనల్ వరకు వెళ్లింది. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 6వ ప్లేస్‌తో బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్
- ●Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం
- ●Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో గొడవలు
- ●Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు
- ●Ganja Seized | రూ.20 లక్షల గంజాయి సీజ్.. రిసీవర్ కోసం పోలీసుల వేట
- ●Weather Report | జూలై 15 వరకు ఎండలే ఎండలు.. బీ కేర్ ఫుల్

Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్

Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం

Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో గొడవలు

Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు






