త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ananthika | మార్ష‌ల్ ఆర్ట్స్‌తో క్ర‌మ‌శిక్ష‌ణ : అనంతిక‌

Ananthika | విభిన్న పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న నటి అనంతిక. ప్రస్తుతం ‘రొమాంచకం’తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ నెల 3న విడుద‌ల విడుద‌లైంది. వేణుగోపాల్‌రెడ్డి దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్‌రెడ్డి భద్రకాళి పిక్చర్స్‌ పతాకంపై నిర్మించారు.

P

Entertainment | Published On Sep 6, 2026, 7.00 pm IST

Ananthika | మార్ష‌ల్ ఆర్ట్స్‌తో క్ర‌మ‌శిక్ష‌ణ : అనంతిక‌
Advertisement

Ananthika | విభిన్న పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న నటి అనంతిక. ప్రస్తుతం ‘రొమాంచకం’తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ నెల 3న విడుద‌ల విడుద‌లైంది. వేణుగోపాల్‌రెడ్డి దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్‌రెడ్డి భద్రకాళి పిక్చర్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో అనంతిక పాల్గొంది. అనంతిక రాజ‌మండ్రి రోజ్ మిల్క్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ‘మ్యాడ్‌’, ‘8 వసంతాలు’ చిత్రాల్లో నటించింది. ‘8 వసంతాలు’ కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.

‘8 వసంతాలు’ తర్వాత ఎన్నో కథలు విన్నానని, కాస్త భిన్నంగా ఉండే బబ్లీ పాత్ర చేయాలనుకున్న సమయంలో ‘రొమాంచకం’ తన వద్దకు వచ్చిందని అనంతిక తెలిపింది. మలయాళీ అమ్మాయినైనప్పటికీ తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నానని అనంతిక చెప్పింది. మ‌ల‌యాళంలో ప‌లు సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చినా.. ‘8 వసంతాలు’తో బిజీగా ఉండడంతో చేయలేకపోయానని వివరించింది. అవకాశం వస్తే తప్పకుండా మలయాళ చిత్రాల్లోనూ నటిస్తానని.. ఒక్క భాషకే పరిమితం కాకుండా అన్ని భాషల్లో పనిచేయాలనుకుంటున్నానని పేర్కొంది. కొత్త సినిమాలను ఎంపిక చేసుకునేటప్పుడు కథ, అందులో తన పాత్రకే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. కథ నచ్చితేనే సినిమా అంగీకరిస్తానని తెలిపింది. బెంగళూరులో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నానని, చదువు-నటన రెండింటినీ బ్యాలెన్స్ చేసుస్తున్న‌ట్లు చెప్పింది. చిన్ననాటి నుంచే కళారూపాలపై ఆసక్తి ఉందని అనంతిక తెలిపింది. కలరిపయట్టు, కరాటేతో పాటు కూచిపూడి, భరతనాట్యం, కథకళి నేర్చుకున్నట్లు చెప్పింది.

చిత్రలేఖనం, పాటలు, నృత్యం వంటి కళలతో ఎప్పుడూ బిజీగా ఉండేదానినని.. అవి తన జీవితంలో అంతర్భాగమయ్యాయని పేర్కొంది. కరాటే, కలరిపయట్టు తనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, సమతుల్యత నేర్పాయని.. అవి వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పింది. విభిన్న జానర్లలో నటించాలని, బలమైన పాత్రల ద్వారా ప్రభావం చూపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ‘పరిమళ అండ్‌ కో’లో సీనియర్‌ నటులు జయరామ్‌, ఊర్వశితో కలిసి పనిచేసి నేర్చుకునే అవకాశం లభించిందని చెప్పింది. చిత్రంలో తన పాత్ర చిన్నదైనా ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉందని పేర్కొంది. దేవిశ్రీ ప్రసాద్‌ నటిస్తున్న ‘ఎల్లమ్మ’లో న‌టించ‌నున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై అనంతిక స్పందించ‌లేదు. తమిళంలో ఓ చిత్రానికి సంతకం చేశానని, వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని వెల్లడించింది. తెలుగులో మరో సినిమా చర్చల్లో ఉందని, దాన్ని నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని తెలిపింది.

Advertisement
Advertisement