Epic Movie | గోరటి వెంకన్నగళంతో….ఆనంద్ దేవరకొండ ఎపిక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఎపిక్ నుంచి ఫస్ట్ సింగిల్‌ను సోమవారం రిలీజ్ చేశారు. తెలంగాణ యాస, భాషలతో ప్రజా కవి గోరటి వెంకన్న రాసిన సంచారమే పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్‌తో కలిసి గోరటి వెంకన్న ఈ పాటను ఆలపించారు.
Entertainment | Published On Mar 9, 2026, 5.11 pm IST
Epic Movie | తెలంగాణ యాసను, ఇక్కడి మట్టి పరిమళాలను, పల్లెజీవితాలను ఆవిష్కరిస్తూ ప్రజా కవి గోరటి వెంకన్న పాటలు సాగుతుంటాయి. తెలుగులో పలు సినిమాలకు గోరటి వెంకన్న సాహిత్యం అందించారు. విప్లవ నేపథ్యాలు, సామాజిక సందేశాలతో తెరకెక్కిన సినిమాల్లో ఆయన రాసిన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాయి. కానీ ఫస్ట్ టైమ్ గోరటి వెంకన్న లవ్‌స్టోరీ కోసం పాటను రాశారు.
ఎపిక్ మూవీ...
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా ఎపిక్ పేరుతో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది.ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఎపిక్ మూవీ...
90 మిడిల్ క్లాస్ మెలోడీస్‌కు సీక్వెల్‌గా ఎపిక్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి సంచారమే అనే ఫస్ట్ సింగిల్‌ను సోమవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను గోరటి వెంకన్న సాహిత్యం అందిండచమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్‌తో కలిసి ఈ పాటను పాడారు.
లండన్ నగర అందాలను, అక్కడి సంస్కృతిని తెలంగాణ శైలిలో వర్ణిస్తూ గోరటి వెంకన్న ఈ పాటను అద్భుతంగా రాశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరటి వెంకట గళం ఈ పాటకు హైలైట్‌గా నిలిచింది. ఎపిక్ సాంగ్ యూట్యూబ్‌తో పాటు మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండ్ అవుతోంది.
బేబీ తర్వాత...
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న సినిమా ఇది. ఉన్నత చదువుల కోసం లండన్‌లో అడుగుపెట్టిన ఓ యువ జంటకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వారి లవ్‌స్టోరీకి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయనే అంశాలతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతోన్నారు. ఈ వేసవిలోనే ఎపిక్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య కెరీర్‌లకు ఎపిక్ సక్సెస్ కీలకంగా మారింది. బేబీ తర్వాత వీరిద్దరు చాలానే సినిమాలు చేశారు. కానీ అవేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



