త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Rides | ఏసీబీ వ‌ల‌లో మ‌రో అవినీతి చేప‌.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన త‌హసీల్దార్

ACB Rides | త‌ర‌చూ ఏసీబీ రైడ్స్ జ‌రుగుతున్నా అవినీతి అధికారుల్లో ఏమాత్రం మార్పు రావ‌డం లేదు. తాజాగా ములుగు జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వ‌ల‌కు చిక్కింది.

S

Telangana | Published On Sep 18, 2026, 3.40 pm IST

ACB Rides | ఏసీబీ వ‌ల‌లో మ‌రో అవినీతి చేప‌.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన త‌హసీల్దార్
Advertisement

ACB Rides | త్రినేత్ర‌.న్యూస్‌: త‌ర‌చూ ఏసీబీ రైడ్స్ జ‌రుగుతున్నా అవినీతి అధికారుల్లో ఏమాత్రం మార్పు రావ‌డం లేదు. తాజాగా ములుగు జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వ‌ల‌కు చిక్కింది. గోవిందరావుపేట మండ‌ల‌ తహసీల్దార్ సృజ‌న్‌కుమార్ త‌న కార్యాల‌యంలో శుక్ర‌వారం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భూమిని వేరొకరి పేరు మీదకు మార్చేందుకు రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

ఎకరం 10 గుంటల భూమిని తన కుటుంబసభ్యుల పేర్లపై మార్చేందుకు ఓ రైతు.. తహసీల్దార్‌ సృజన్‌కుమార్‌ను సంప్రదించాడు. అందుకు ఆయన రైతును లంచం డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వ‌డానికి నిరాక‌రించిన‌ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం గోవిందరావుపేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సృజన్‌కుమార్ స‌ద‌రు రైతు నుంచి రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో దాడులు నిర్వహించారు. సృజన్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కాగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Advertisement
Advertisement