Allu Sirish | అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు షురూ – బన్నీ మిస్సింగ్ – స్పెషల్ గెస్ట్‌గా ఉపాసన
అల్లు శిరీష్ పెళ్లి పనులు మొదలయ్యాయి. గురువారం పసుపు దంచుడు వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేశారు. అట్లీ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ ఈ వేడుకను మిస్సయ్యారు.
Entertainment | Published On Feb 13, 2026, 3.55 pm IST
Allu Sirish | అల్లు వారి ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అల్లు అరవింద్ తనయుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి ప్రియురాలు నయనికతో మార్చి 6న జరుగనుంది. పెళ్లి పనులను శుక్రవారం నుంచి అఫీషియల్‌గా మొదలుపెట్టారు. పసుపు దంచుడు ఫంక్షన్‌ను నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా తన పెళ్లి వేడుకలను జరుపుకోవాలని శిరీష్ ఫిక్సయ్యారట. పెళ్లికి గడువు మరో మూడు వారాలు ఉండగానే ఇంట్లోనే పనుసు దంచే ఫంక్షన్‌ను జరుపుకున్నారు. ఈ వేడుకలో అల్లుతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాతో పాటు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, చిరంజీవి కూతురు సుస్మిత పాల్గొన్నారు. పసుపు దంచే ఫంక్షన్ తాలూకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు శిరీష్. తన పెళ్లి పనులు మొదలయ్యాయని ప్రకటించాడు.
బన్నీ మిస్సింగ్...
అల్లు శిరీష్ పసుపు దంచుడు వేడుకలో అల్లు అర్జున్ మాత్రం కనిపించలేదు. బన్నీ ఎక్కడ అంటూ శిరీష్ వీడియోను ఉద్దేశించి పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. వారి కామెంట్లపై బన్నీ రియాక్ట్ అయ్యాడు. తాను వేడుకలో భాగం కావాల్సిందని, కానీ మిస్సయ్యానంటూ ఓ పోస్ట్ పెట్టాడు. అట్లీ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్...తమ్ముడి పెళ్లి వేడుకలో పాల్గొనలేకపోయినట్లు సమాచారం. పెళ్లి కోసం మాత్రం షూటింగ్‌కు పది రోజుల పైనే బ్రేక్ తీసుకోనున్నాడట.
రెండేళ్లుగా ప్రేమలో...
అల్లు శిరీష్, నయనిక పెళ్లి మార్చి 6న జరుగనుంది. అల్లు అర్జున్, స్నేహ దంపతుల పెళ్లి రోజు కూడా అదే కావడం గమనార్హం. గత రెండేళ్లుగా నయనికతో ప్రేమలో ఉన్నాడు శిరీష్. పెద్దల అంగీకారంతో గత ఏడాది వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అల్లు అరవింద్ తనయుల్లో అల్లు అర్జున్ టాప్ హీరోగా కొనసాగుతోండగా...అల్లు శిరీష్ మాత్రం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పదమూడేళ్ల కెరీర్‌లో కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమే చేశాడు. రెండేళ్ల క్రితం రిలీజైన బడ్డీతో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. పెళ్లి తర్వాత మగజాతి ఆణిముత్యం పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

anirudh | అల్లు అర్జున్ సినిమాకు అనిరుధ్ షాకింగ్ రెమ్యూనరేషన్ – రెహమాన్‌ను దాటేశాడుగా!
మే 3, 2026

Allu Arjun Pushpa 2 | అల్లు అర్జున్ పుష్ప 2 లాభాలపై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ పోస్ట్
ఏప్రిల్ 24, 2026

Deepika Padukone | అల్లు అర్జున్ రాకా నుంచి దీపికా పదుకొనే ఔట్ – రూమర్లలో నిజమెంత?
ఏప్రిల్ 23, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



