Pawan Kalyan | అల్లు శిరీష్ పెళ్లి – పవన్ కళ్యాణ్, నాగబాబులకు ఆహ్వానం…
ప్రియురాలు నయనిక రెడ్డితో అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6న జరుగనుంది. తన పెళ్లికి ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్‌తో పాటు ఎమ్ఎల్‌సీ నాగబాబులను ఆహ్వానించాడు శిరీష్. వారికి శుభలేఖలు అందజేశాడు.
Entertainment | Published On Feb 23, 2026, 2.37 pm IST
Pawan Kalyan | టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. మార్చి 6న ప్రియురాలు నయనిక రెడ్డితో అల్లు శిరీష్ వివాహం జరుగనుంది. ఓ వైపు పెళ్లి పనులతో పాటు మరోవైపు ప్రీ వెడ్డింగ్ పార్టీలతో అల్లు శిరీష్, నయనిక బిజీగా ఉన్నారు. ఇటీవలే అల్లు శిరీష్, నయనికల కోసం అల్లు అర్జున్ ఓ స్పెషల్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టాలీవుడ్ హీరోహీరోయిన్లు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్...నాగబాబు...
తన పెళ్లిని సంప్రదాయ బద్దంగా జరుపుకోవాలని ప్లాన్ చేసిన శిరీష్ మొదటి శుభలేఖను మావయ్య మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్‌తో పాటు ఎమ్ఎల్‌సీ నాగబాబులకు తన వెడ్డింగ్ కార్డును అందజేశాడు శిరీష్, తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి కాబోయే పెళ్లికొడుకు శిరీష్...పవన్ కళ్యాణ్, నాగబాబు నివాసాలకు వెళ్లారు. వారికి శుభలేఖలు అందించిన పెళ్లికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో...
ఇటీవలే శిరీష్ పెళ్లి వేడుకల్లో భాగంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుక తాలూకు ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
అల్లు శిరీష్ పెళ్లి హైదరాబాద్‌లోనే జరుగనున్నట్లు సమాచారం. కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితులతో, టాలీవుడ్ హీరోలు మాత్రమే ఈ పెళ్లికి అటెండ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అల్లు శిరీష్, నయనిక రెడ్డి గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నితిన్ భార్య షాలిని ద్వారా శిరీష్, నయనిక మధ్య పరిచయం ఏర్పడినట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



