త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Sirish | పెళ్లి డేట్ చెప్పేసిన శిరీష్ – అల్లు ఫ్యామిలీలో ఈ తేదీకి ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే?

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఫిక్స‌య్యింది. మార్చి 6న న‌య‌నిక‌తో అల్లు శిరీష్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. ఓ వీడియో ద్వారా శిరీష్ పెళ్లి రోజును ప్ర‌క‌టించాడు. కాగా మార్చి 6 అల్లు అర్జున్ పెళ్లి రోజు కావ‌డం గ‌మ‌నార్హం.

N

Entertainment | Published On Dec 29, 2025, 12.56 pm IST

Allu Sirish |  పెళ్లి డేట్ చెప్పేసిన శిరీష్ – అల్లు ఫ్యామిలీలో ఈ తేదీకి ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే?
Advertisement

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఫిక్స‌య్యింది. మార్చి 6 ఈ యంగ్ హీరో వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఓ వీడియో ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు శిరీష్‌. ఈ వీడియోలో శిరీష్‌తో పాటు అల్లు అర్జున్ కొడుకు అయాన్‌, కూతురు అర్హ  క‌నిపించారు. ఓ ట్రెండింగ్ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ వెరైటీగా పెళ్లి రోజును రివీల్ చేశాడు శిరీష్‌. సంగీత్ ఎప్పుడ‌ని పిల్ల‌లు అడ‌గ్గా...మ‌నం సౌత్ ఇండియ‌న్స్‌...సంగీత్ లాంటివి చేసుకోము అని శిరీష్ రిప్లై ఇచ్చాడు.

అల్లు అర్జున్ పెళ్లి రోజే...

మార్చి 6కు అల్లు ఫ్యామిలీలో ఓ ప్ర‌త్యేక‌త ఉంది. మార్చి 6న అల్లు అర్జున్ పెళ్లి రోజు కావ‌డం గ‌మ‌నార్హం. 2011 మార్చి 6న స్నేహారెడ్డి తో అల్లు అర్జున్ పెళ్లి జ‌రిగింది. అన్న పెళ్లి జ‌రిగిన రోజే త‌మ్ముడుకొత్త జీవితాన్ని మొద‌లుపెట్ట‌బోతుండటం ఆసక్తికరంగా మారింది.  అల్లు శిరీష్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. విదేశాల్లో శిరీష్, నయనిక పెళ్లి వేడుకలు జరుగనున్నాయట

గ‌త అక్టోబ‌ర్ 31న అల్లు శిరీష్‌, న‌య‌నిక ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌లో అల్లు ఫ్యామిలీతో పాటు మెగా హీరోలంద‌రూ సంద‌డి చేశారు. ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. న‌య‌నిక‌తో అల్లు శిరీష్ రెండేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాడు. పెద్ద‌ల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు.

గౌరవం సినిమాతో అల్లు శిరీష్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణంతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. హీరోగా ఈ సినిమాలు శిరీష్ కు మంచి పేరు తెచ్చిపెట్టిన కమర్షియల్ గా విజయాలను అందించలేకపోయాయి. గత ఏడాది రిలీజైన బడ్డీ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు శిరీష్.

Advertisement

తాజావార్తలు

Advertisement