Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ – రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం
రాకా కోసం కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో తండ్రీగా, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Aug 28, 2026, 3.35 pm IST
Allu Arjun | కెరీర్‌లో ఫస్ట్ టైమ్ రాకా కోసం అల్లు అర్జున్ ఓ వెరైటీ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీలో దీపికా పడుకోణ్, రష్మిక మందన్నతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ రూమర్...
అనౌన్స్‌మెంట్ నుంచే అభిమానుల్లో రాకా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్, గెటప్‌తో పాటు క్యారెక్టరైజేషన్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.
తండ్రీకొడుకులుగా...
తండ్రితో పాటు ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ రాకాలో కనిపిస్తాడని అంటున్నారు. మూడు పాత్రల మధ్య అల్లు అర్జున్ చూపించే వేరియేషన్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని టాక్. తండ్రి పాత్రలో వయసు మళ్లిన వ్యక్తిగా బన్నీ నటన సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.
ఫస్ట్ టైమ్...
అల్లు అర్జున్ ఇప్పటివరకు డ్యూయల్ రోల్ కూడా చేయలేదు. ఫస్ట్ టైమ్ ఏకంగా ట్రిపుల్ రోల్‌లో కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరోలను డ్యూయల్ రోల్, ట్రిపుల్ రోల్స్‌లో చూపించడం దర్శకుడు అట్లీకి మాత్రం కొత్తేమీ కాదు. అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన అదిరిందిలో దళపతి విజయ్ త్రిపాత్రాభినయం, జవాన్‌లో షారుఖ్‌ఖాన్ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ను అట్లీ ఎలా చూపించబోతున్నాడన్నది ఫ్యాన్స్‌లో ఉత్కంఠగా మారింది.
ప్రస్తుతం రాకా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ నుంచే జాన్వీ కపూర్, రష్మిక మందన్న రాకా షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు చెబుతోన్నారు. ఆగస్ట్‌లోనే రాకా సెట్స్‌లో రష్మిక మందన్న అడుగుపెట్టాల్సింది. గాయం కారణంగా డిలే అయ్యింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026

Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య – రష్మిక మందన్న ఊరితో లింక్?
సెప్టెంబర్ 4, 2026

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



